Komatireddy Venkat Reddy : డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ..! కీలక అంశాలపై చర్చలు

కర్ణాటకలో గెలిచినట్లుగా కాంగ్రెస్ తెలంగాణలోను గెలుస్తుందా. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అదే జోష్ తో గెలుపు సాధిస్తారా? తాజాగా బెంగళూరు వెళ్లిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఏమని చర్చించారు? పార్టీ వీడిని తమ్ముడిని వెంకట్ రడ్డి తిరిగి పార్టీలోకి తీసుకొస్తారా? రాజగోపాల్ రెడ్డి సొంతగూటికి చేరతారా? బీజేపీలో ఆయన మౌనం అర్థాంగీకారమా?

Komatireddy Venkat Reddy : డీకే శివకుమార్‌తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ..! కీలక అంశాలపై చర్చలు

Komatireddy Venkat Reddy Meets DK Shivakumar

komatireddy venkat reddy met dk shiva kumar : కర్ణాటకలో ఘన విజయం జోష్ తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో నిండుగా కనిపిస్తోంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ దే విజయం అనే ధీమాతో ఇటు టీ కాంగ్ నేతలు అటు అధిష్టానం కూడా ఉంది. దీంతో నేతలంతా కలిసి పనిచేస్తున్నారు. గతంతో విమర్శలు చేసుకున్నవారు కూడా కలిసి మెలిసి పనిచేస్తున్నారు. తెలంగాణలో గెలుపు కోసం చేయాల్సిందంతా చేస్తున్నారు. ఈక్రమంలో కర్ణాటకలో కాంగ్రెస్ విజయంలో కీలక భూమిక పోషించిన డీకే శివకుమార్ సలహాలు కూడా తీసుకుంటున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కర్ణాటక వెళ్లి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి జూపల్లిని పార్టీలో చేర్చటానికి..అలాగే  పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా పార్టీలోకి రావటానికి దాదాపు ఖారారు చేయటంలో  జరిగిన చర్చల్లో పాల్గొన్నారు కోమటిరెడ్డి. ఈక్రమంలో ఆయన ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ తో సమావేశం కావటం ప్రాధాన్య సంతరించుకుంది. కొన్ని రోజుల క్రితం షర్మిల డీకేతో సమావేశమయ్యారు. ఆమె తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేస్తుందనే వార్తలు వస్తున్నాయి.

Gutta Sukhender Reddy : మూడో సారి కేసీఆర్ సీఎం కావడం ఖాయం : గుత్తా సుఖేందర్ రెడ్డి

ఈక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి డీకేతో సమావేశం కావటం..పార్టీనుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి పార్టీలోకి చేర్చుకునేలా వ్యూహాల కోసం వీరిద్దరి సమావేశమయ్యారని తెలుస్తోంది.మరి ముఖ్యంగా కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని కూడా తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొస్తానని డీకేతో కోమటిరెడ్డి చెప్పినట్లుగా సమాచారం.

కొంతకాలంగా పార్టీలో సైలెంట్ గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తరువాత ఆయన వైఖరిలో మార్పు వచ్చినట్లుగా తెలుస్తోంది. గతంలో రేవంత్ రెడ్డితో ఉన్న విభేధాలను కూడా పక్కన పెట్టి ఆయనతో కలిసి పనిచేస్తున్నారు. అలా తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. కర్ణాటకలో వలెనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం డీకే సేవలను వినియోగించుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.

దీంట్లో భాగంగానే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బెంగళూరు వెళ్లిన డీకే శివకుమార్‌ను కలిసి రాష్ట్రంలోని పరిణామాలపై చర్చించినట్టుగా సమాచారం. కోమటిరెడ్డి ఇటీవల ఢిల్లీలో కూడా కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో సమమావేశమై పలు అంశాలు చర్చించారు. ప్రియాంకా గాంధీ సూచనల మేరకే వెంకట్ రెడ్డి డీకే శివకుమారర్‌తో సమావేశమైనట్టుగా తెలుస్తోంది.వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్‌లో విలీనంపై ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా సమాచారం. డీకే శివకుమార్ ఫ్యామిలీతో షర్మిల కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ సత్సంబంధాలను షర్మిల వైఎస్సార్‌టీపీని.. కాంగ్రెస్‌లో విలీనం చేయించటానికి శివకుమార్‌తో కోమటిరెడ్డి చర్చించినట్టుగా తెలుస్తోంది.

Nandeshwar Goud: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే ఆ ఇళ్లపైకి బుల్డోజర్లను పంపుతాం: మాజీ ఎమ్మెల్యే

అలాగే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి కాంగ్రెస్ లోకి తీసుకొస్తానని ఆయన డీకేకు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాగా..ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో రాజగోపాల్ రెడ్డి పాల్గొనలేదు. పార్టీలో కూడా యాక్టివ్ గా లేరు. దీంతో రాజగోపాల్ రెడ్డి తిరిగి తన సొంతగూటికి చేరుకుంటారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈక్రమంలో మరి సోదరుడిని కాంగ్రెస్ లోకి తీసుకురావటంతో కోమటిరెడ్డి సఫలీకృతులు అవుతారే లేదో వేచి చూడాలి. అలాగే గతంలో కాంగ్రెస్‌ను వీడిన నేతలు కూడా తిరిగి పార్టీలోకి చేరాలని కూడా పిలుపునిస్తున్నారు. ఏ పార్టీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవటానికి సిద్ధంగా ఉంది టీ కాంగ్రెస్. బీఆర్ఎస్ ను ఓడించటానికి తమ పార్టీ అధికారంలోకి రావటానికి అస్త్రశస్త్రాలు ఉపయోగిస్తోంది తెలంగాణ కాంగ్రెస్.