Minister KTR : ప్రధానికి మంత్రి కేటీఆర్ 10 ప్రశ్నలు.. సమాధానం చెప్పాకే మోదీ వరంగల్ లో అడుగుపెట్టాలి

కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలన్నారు.

Minister KTR : ప్రధానికి మంత్రి కేటీఆర్ 10 ప్రశ్నలు.. సమాధానం చెప్పాకే మోదీ వరంగల్ లో అడుగుపెట్టాలి

KTR questions Modi (1)

KTR Questions Modi : ప్రధానమంత్రి  నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. జులై8వ తేదీన వరంగల్ కు రానున్న ప్రధాని మోదీకి కేటీఆర్ 10 ప్రశ్నలు వేశారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పి, ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ప్రధాని వరంగల్ లో అడుగుపెట్టాలని డిమాండ్ చేశారు. ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

బయ్యారం ఉక్కు కర్మాగారంలో ఏర్పాటు చేస్తామన్న కేంద్రం ఎందుకు చేతులెత్తేసిందో చెప్పాలని నిలదీశారు. కోచ్ ఫ్యాక్టరీ పెడతామని, బోగీలు రిపేర్ చేసే కేంద్రం పెట్టడానికి వస్తున్న మోదీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను ఎందుకు విస్మరించారో ప్రకటించాలన్నారు.

Revanth Reddy: ఖమ్మం వేదికగా కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం.. బీఆర్ఎస్ ఎన్ని అడ్డుగోడలు పెట్టినా పడగొడతాం: రేవంత్ రెడ్డి

ఇది ఎన్నికల సీజన్.. కొత్తకొత్తోళ్లు వస్తారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నిన్నమొన్నటి దాకా 50ఏళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేసిన కాంగ్రెసోళ్లు ఇప్పుడు మళ్లీ వస్తున్నారని పేర్కొన్నారు. ఇంతకాలం గుడ్డిగుర్రాల పండ్లు తోమాడానికి పోయిండ్రా అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెసోళ్లు అధికారంలోకి రావడం కోసం ఎలాంటి గడ్డయినా తింటారు జాగ్రత్త అని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన బిడ్డల జీవితాల్లో వెలుగు నింపిన పండుగ రోజు ఇది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వాయువేగంతో అభివృద్ధి చెందుతూ దేశానికి దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు.

Etela Rajender : వయసు, అనుభవం ఉన్నవారు ఏదీ పడితే అది మాట్లాడొద్దు : జితేందర్ రెడ్డికి ఈటల కౌంటర్

త్వరలో మరో 84వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సంపన్నులు ఏ నీళ్లు తాగుతున్నారో.. మారుమూల గిరిజన గ్రామాల బిడ్డలు కూడా అదే నీళ్లు తాగుతున్నారని వెల్లడించారు. జల్.. జంగిల్.. జమీన్ అనే కొమురం భీమ్ నినాదాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆచరణలో అమలు చేస్తుందన్నారు.