Delhi Metro : మెట్రో రైల్లో మద్యం బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతి

ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక మెట్రో రైలులో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.

Delhi Metro : మెట్రో రైల్లో మద్యం బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతి

Carrying alcohol permiton In Delhi Metro

Carrying alcohol permiton In Delhi Metro :  ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) శుక్రవారం (జూన్ 30,2023) కీలక ప్రకటన విడుదల చేసింది. ఇక మెట్రో రైలులో మద్యం తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ఇక నుంచి మెట్రో రైలులో ప్రయాణించేవారు మద్యం బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులు మద్యం బాటిల్స్ తీసుకెళ్లేందుకు అనుమతించింది. మద్యం బాటిల్స్ తీసుకెళ్లవచ్చు కానీ..మెట్రో రైలులో మద్యాన్ని సేవించకూడదని తేల్చి చెప్పింది.

మెట్రోలో మద్యాన్ని తీసుకురావడానికి అనుమతి ఉంటుందా? అంటూ ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఢిల్లీ మెట్రో(DMRC) సమాధానం ఇస్తు..ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ లైన్ లోని నిబంధనలతో సమానంగా ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి (ప్రయాణీకుడు) పూర్తిగా సీలు చేసిన రెండు ఆల్కాహాల్ బాటిళ్లను తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రకటిచింది. మెట్రో రైలులో గానీ మెట్రో ప్రాగణంలో మద్యం సేవించడం ఇప్పటికీ ఖచ్చితంగా నిషేధించబడుతుంది అని స్పష్టంచేసింది.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) మరియు DMRC అధికారులతో కూడిన కమిటీ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్‌లో మినహా రైళ్లలో మద్యం రవాణా చేయడాన్ని నిషేధించిన గతంలోని ఆదేశాలపై సమీక్షించిన తరువాత ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని నిబంధనలకు సమానంగా ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తికి రెండు సీలు చేసిన మద్యం బాటిళ్లను తీసుకెళ్లడానికి కమిటీ అనుమతిని ఇచ్చింది.

మద్యం తాగిన మత్తులో ప్రయాణికుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తే, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కాగా ఢిల్లీ మెట్రోలో పదునైన వస్తువులు, పేలుడు పదార్ధాలు, పేలుడు పదార్ధాలు, తుపాకులు,డిసేబుల్ కెమికల్స్, తో పాటు ఇతర ప్రమాదకర వస్తువులు తీసుకెళ్లటం నిషేధం.