Etala Rajender: వై ప్లస్ భద్రతపై తనకు ఇంకా ఎలాంటి ఆర్డర్ కాపీ అందలేదు.. మీడియాలోనే చూశా..

రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. అధికారికంగా తనకు ఆర్డర్ కాఫీ అందలేదని అన్నారు. తన భద్రత‌పై ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మాకు రాలేదని చెప్పారు.

Etala Rajender: వై ప్లస్ భద్రతపై తనకు ఇంకా ఎలాంటి ఆర్డర్ కాపీ అందలేదు.. మీడియాలోనే చూశా..

MLA Etala Rajender

Etala Rajender: హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేంద్ర (Etala Rajender) కు భద్రత పెంపు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం (Telangana government) నిర్ణయం తీసుకుంది. ఈటలకు వై ప్లస్ భద్రత (Y Plus security) కల్పించింది. గతంలో ఈటలకు 2ప్లస్2 భద్రత ఉండేది. ప్రస్తుతం వై ప్లస్ భద్రతలో 11 మంది సిబ్బంది ఉంటారు. మూడు షిప్ట్‌లలో భద్రతా సిబ్బంది ఈటల వెంట ఉంటారు. ఈటల నివాసం, కార్యాలయాల్లో భద్రత సిబ్బంది రక్షణగా ఉంటారు.  శనివారం నుంచి భద్రతా సిబ్బంది విధుల్లోకి చేరుతారని ప్రభుత్వం పేర్కొంది.

Etala Rajender : బీజేపీలో ఈటల మౌనం, అనుచరులతో సమావేశం.. పార్టీ మారతారంటూ ప్రచారం

రాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రత కల్పించడంపై ఈటల రాజేందర్ స్పందించారు. అధికారికంగా తనకు ఆర్డర్ కాఫీ అందలేదని అన్నారు. తన భద్రత‌పై ఇంకా ఎలాంటి ఉత్తర్వులు మాకు రాలేదని చెప్పారు. వై ప్లస్ భద్రత ఇచ్చారని మీడియాలో చూశానని ఈటల అన్నారు. అయితే, నాకు భద్రత ముఖ్యం కాదు, నాపై ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఈటల రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాపై ప్రత్యక్షంగా ఆరోపణలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నానని అన్నారు. నా జీవితం తెరిచిన పుస్తకం. ఎవ్వరికి భయపడే వ్యక్తిని నేను కాదు. నాయుమ్ లాంటి వాళ్లే కనుమరుగయ్య్యారు అంటూ ఈటల వ్యాఖ్యానించారు.

Eatala Rajender : బీజేపీ ఎమ్మెల్యేకి వై ప్లస్ సెక్యూరిటీ.. కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

గత రెండురోజుల క్రితం తన భర్త ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరిగిందని ఈటల జమున చేసిన ఆరోపణలు రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి రూ.20కోట్లు ఖర్చు చేసైనా తన భర్తను హత్య చేయిస్తానని అన్నారని ఆమె ఆరోపించారు. అంతేకాక తన హత్యకు కుట్రలు చేస్తున్నారని, తన జిల్లాల పర్యటనల్లో గుర్తుతెలియని వాహనాలు తనను ఫాలో అవుతున్నాయని ఈటలసైతం చెప్పారు. ఈటల ఆరోపణలపై స్పందించిన మంత్రి కేటీఆర్ ఈటల భద్రత విషయంపై సమీక్షించాలని డీజీపీకి సూచించారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈటల భద్రతపై సమీక్షించిన మేడ్చల్ డీసీపీ సందీప్ రావు డీజీపీకి నివేదిక అందించారు. ఈ నివేదిక ఆధారంగా ఎమ్మెల్యే ఈటల రాజేంద్రకు వై ప్లస్ భద్రతను ప్రభుత్వం కల్పించింది.