Parliament Monsoon Session: విడుదలైన పార్లటెంట్ సమావేశాల షెడ్యూల్.. ప్రారంభం పాత భవనంలో, ముగింపు కొత్త భవనంలో..

ప్రధానమంత్రి మోదీ యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు బలమైన సంకేతాలు ఇచ్చారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు. ఇలాంటి బలమైన రాజకీయ ఎత్తుగడల మధ్య పార్లమెంటు సమావేశమవుతోంది.

Parliament Monsoon Session: విడుదలైన పార్లటెంట్ సమావేశాల షెడ్యూల్.. ప్రారంభం పాత భవనంలో, ముగింపు కొత్త భవనంలో..

New Parliament Building: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల (జూలై) 20న ప్రారంభం కానున్న సమావేశాలు, వచ్చే నెల (ఆగస్టు) 11 వరకు కొనసాగనున్నట్లు పార్లమెంట్ వ్యవహారాల శాఖామంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. అయితే నూతన పార్లమెంట్ భవనం ప్రారంభమైన నేపథ్యంలో ఒక ప్రత్యేక సమాచారాన్ని ఆయన వెల్లడించారు. ఈసారి జరిగే సమావేశాలు పాత పార్లమెంట్ భవనంపై ప్రారంభమవుతాయని, అనంతరం సమావేశాలు కొనసాగుతున్న క్రమంలోకి కొత్త భవనంలోకి మారి, అక్కడే ముగుస్తాయని మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు.

Etala Rajender: వై ప్లస్ భద్రతపై తనకు ఇంకా ఎలాంటి ఆర్డర్ కాపీ అందలేదు.. మీడియాలోనే చూశా..

ఇదే కనుక జరిగితే.. కొత్త పార్లమెంట్ భవనంలో జరిగే మొదటి సమావేశాలు ఇవే కానున్నాయి. ఈ ప్రకటన చేస్తూనే సెషన్‌లో జరిగే చర్చలకు రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నందున వర్షాకాల సెషల్ పార్లమెంటులో తుఫాను సృష్టిస్తుందని భావిస్తున్నారు.

Minister Ambati Rambabu: పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి సంచలన వ్యాఖ్యలు.. చీడ పురుగు అంటూ ఆగ్రహం..

అలాగే, ప్రధానమంత్రి మోదీ యూనిఫాం సివిల్ కోడ్ ప్రవేశపెట్టనున్నట్లు బలమైన సంకేతాలు ఇచ్చారు. ఈ అంశంపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు. ఇలాంటి బలమైన రాజకీయ ఎత్తుగడల మధ్య పార్లమెంటు సమావేశమవుతోంది. “పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, 2023 జూలై 20 న ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతాయి. సెషన్‌లో శాసన వ్యవహారాలు, ఇతర అంశాలపై ఉత్పాదక చర్చలకు సహకరించాలని అన్ని పార్టీలను కోరాము” అని మంత్రి జోషి ట్వీట్ చేశారు.

Telangana Politics: కూతురు, అల్లుడి వ్యవహారంపై కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

సెషన్ 23 రోజుల పాటు సాగుతుందని, 17 సిట్టింగ్‌లు ఉంటాయని ఆయన హిందీలో చేసిన మరో ట్వీట్‌లో తెలిపారు. ఈ సెషన్‌లో ఢిల్లీ గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ (సవరణ) ఆర్డినెన్స్ స్థానంలో ఒక బిల్లును మోదీ ప్రభుత్వం తీసుకొచ్చే అవకాశం ఉంది. సర్వీసుల విషయంలో ఢిల్లీ ప్రభుత్వానికి అధిక శాసన, పరిపాలనా నియంత్రణను ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఈ తీర్పును కొత్త ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ప్రతిపాదిత ఫౌండేషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలలో దేశ పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించడానికి కొత్త నిధుల ఏజెన్సీగా ఉంటుంది.