Ponguleti Srinivasa Reddy: జరగరానిది జరిగిపోతే ఎవరు బాధ్యులు?: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

లక్షల జనం, జాతీయ నాయకుడు వచ్చారని, పోలీసులు చెక్ పోస్టులు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేశారని తెలిపారు.

Ponguleti Srinivasa Reddy: జరగరానిది జరిగిపోతే ఎవరు బాధ్యులు?: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivasa Reddy – Congress: ఖమ్మం(Khammam)లో కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ (BRS) పోలీసులతో కలిసి అనేక విధాలుగా ప్రజలకు ఇబ్బందులు కలుగజేసిందని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్ హాల్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

నిన్న ఏదన్నా జరగరానిది జరిగి ఉంటే దానికి బాధ్యులు ఎవరిదని, బీఆర్ఎస్, డీజీపీది కాదా? అని పొంగులేటి నిలదీశారు. నీచంగా ఆఖరికి మంచి నీళ్లు కూడా ఆపేశారని తెలిపారు. తమ సభను అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని చెప్పారు. ప్రజలను ఖమ్మం సభకు ఆర్టీసీ బస్సుల్లో తరలిస్తుంటే అడ్డుకున్నారని తెలిపారు.

ఇప్పటికే ఆర్టీసీ కష్టాల్లో ఉందని, తమ ద్వారా డబ్బులు వస్తుంటే, అవి ఉపయోగపడవా? అని పొంగులేటి అన్నారు. గూడ్స్ బస్ లనూ వాడకుండా కుట్ర పన్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ నిర్వహించే సభలకు మాత్రం వాటి ఎలా వాడారని తాను స్వయంగా ఆర్టీఏ అధికారిని అడిగానని చెప్పారు. లక్షల జనం, జాతీయ నాయకుడు వచ్చారని, పోలీసులు చెక్ పోస్టులు పెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేశారని తెలిపారు. డీజీపీ, సీపీ ఇది గమనించారా? అని అన్నారు. ఇదేనా వారి పని తీరు అని ప్రశ్నించారు.

ఆట మొదలు
ఖమ్మంలో ఆట మొదలైందని పొంగులేటి అన్నారు. సభను విజయవంతం చేసిన లక్షలాది మంది ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. కేవలం నాలుగు రోజుల్లో సభకు ఏర్పాట్లు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పటి కంటే, ఇప్పుడే ప్రజలు తనను మరింత ఆదరించారని తెలిపారు. సీఎం నిర్వహించిన సభను తలదన్నే తమ సభ విజయవంతమైందని చెప్పారు.

Raghunandan Rao : నన్ను చూసి ఓట్లు వేశారు, బీజేపీని చూసి కాదు, 100కోట్లు ఖర్చు పెట్టినా మునుగోడులో గెలవలేదు- రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు