KH233 : ఉలగనాయగన్.. KH233 షురూ.. వీడియో షేర్ చేసిన కమల్ హాసన్
గతేడాది విక్రమ్ (Vikram ) చిత్రంతో భారీ హిట్‌ను అందుకున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan). ఈ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహాంతో ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నాడు.
KH233 Starts : గతేడాది ‘విక్రమ్’ (Vikram ) చిత్రంతో భారీ హిట్‌ను అందుకున్నాడు లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan). ఈ చిత్ర విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఆయన వరుసగా సినిమాలను చేస్తున్నాడు. ‘వలిమై’, ‘తునివు’ చిత్రాల దర్శకుడు హెచ్ వినోథ్ (H Vinoth) వినోద్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఓ చిత్రంలో నటించనున్నాడు అనే విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు. దీనికి KH233 వర్కింగ్ టైటిల్‌గా పెట్టారు. కమల్ కెరీర్లో ఇది 233వ సినిమా.
Shahrukh Khan : షూటింగ్లో షారుఖ్‌కి ప్రమాదం.. అమెరికాలో సర్జరీ.. ఆందోళనలో అభిమానులు..
‘రైజ్ టు రూల్’ అనేది ట్యాగ్‌లైన్. ఇందుకు సంబంధించిన అప్డేట్ను వీడియో రూపంలో పోస్ట్ చేశారు. కమల్ హాసన్ హోం బ్యానర్ రాజ్‌కమల్ ఫిలిం ఇంటర్నేషనల్పై కమల్ హాసన్-ఆర్ మహేంద్రన్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఉలగనాయగన్.. KH233 షురూ..’ అంటూ లాంఛ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. ఈ చిత్రంలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి ఎటువంటి వివరాలను తెలపలేదు. త్వరలోనే వెల్లడించనున్నారు.
Ram Charan : ఇదేం యాడ్రా బాబు.. ఏజెంట్ లెవల్లో చరణ్‌తో మీషో యాడ్
RISE TO RULE#Ulaganayagan #KamalHaasan #KH233 #RKFI52 #RISEtoRULE@ikamalhaasan #HVinoth #Mahendran @RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/lWAS5QF6Kq
— Raaj Kamal Films International (@RKFI) July 4, 2023
ఇదిలా ఉంటే.. కమల్ హాసన్ ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో ‘భారతీయుడు 2′ సినిమాలో నటిస్తున్నాడు. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న’ప్రాజెక్ట్ K’ చిత్రంలో ఓ కీలక పాత్రను లోకనాయుడు పోషిస్తున్నాడు. ఇవే కాకుండా KH233 తో పాటు మణిరత్నం దర్శకత్వంలో KH234 ప్రాజెక్టు కమల్ సైన్ చేశాడు.