Elon Musk: ‘థ్రెడ్స్’ ఫీచర్స్ ట్విటర్ నుంచి కాపీ ఫేస్ట్ చేశారా? ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్

Elon Musk: ‘థ్రెడ్స్’ ఫీచర్స్ ట్విటర్ నుంచి కాపీ ఫేస్ట్ చేశారా? ఎలాన్ మస్క్ ట్వీట్ వైరల్

Elon Musk vs Mark Zuckerberg

Threads App: ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ (Twitter) కు పోటీగా మెటా సరికొత్తగా ‘థ్రెడ్స్’ యాప్‌ (Threads App) అందుబాటులోకి వచ్చింది. థ్రెడ్స్ యాప్ ప్లే‌స్టోర్‌లో అందుబాటులోకి వచ్చిన తొలి రెండు గంటల్లోనే రెండు మిలియన్ల మంది, నాలుగు గంటల్లో ఐదు మిలియన్ల మంది డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు. గంటగంటకు థ్రెడ్స్ యాప్ డౌన్‌లోడ్స్ పెరుగుతున్నాయి. థ్రెడ్స్ దూకుడును చూస్తుంటే కొద్దికాలంలోనే ట్విటర్‌ను అధిగమిస్తుందా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ట్విటర్ యొక్క వినియోగదారుల సామర్థ్యానికి ప్రత్యర్థిగా ఉన్న థ్రెడ్స్‌లో చేరడానికి మెటాకి దాని ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వినియోగదారుల్లో నాలుగింట ఒక వంతు మాత్రమే అవసరం అవుతుంది.

Threads App: థ్రెడ్స్ యాప్ వచ్చేసింది.. నాలుగు గంటల్లోనే ఐదు మిలియన్ల డౌన్‌లోడ్స్

ట్విటర్ కంటే థ్రెడ్స్ పైచేయి సాధిస్తుందా? అనే ప్రశ్నకు ఫేస్ బుక్ సీఈఓ జూకర్ బర్గ్ ఆశ్చర్యకరమైన సమాధానం ఇచ్చారు. దానికి కొంచెం సమయం పడుతుందని చెప్పారు. అయితే ఒక బిలియన్ ప్లస్ మంది వ్యక్తులు పబ్లిక్ సంభాషణలో యాప్ ఉండాలని భావిస్తున్నానని చెప్పారు. ఇదిలాఉంటే జకర్‌బర్గ్ థ్రెడ్స్ యాప్ లాంచ్ అయిన తరువాత కొద్దిసేపటికి ట్విటర్‌లో ఓ కార్టూన్‌ను పోస్టు చేశారు. స్పైడర్‌మ్యాన్‌గా దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు ఎదురుపడినట్లు ఉంది. ఈ చిత్రం 1967 స్పైడర్‌మాన్ కార్టూన్ “డబుల్ ఐడెంటిటీ” నుండి వచ్చింది.

Elon Musk Tweet

Elon Musk Tweet

మరోవైపు ట్విటర్ ఫీచర్స్ ఆధారంగా థ్రెడ్స్ యాప్ ను లాంచ్ చేశారని పలువురు పేర్కొంటున్నారు. థ్రెడ్స్‌లోని ఫీచర్స్ ట్విటర్ నుంచి కాపీ, ఫేస్ట్ చేయబడ్డాయని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ట్విటర్లో ఇలాంటి పోస్టులు అధికంగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ నెటిజన్.. మెటా యొక్క కొత్త యాప్‌లోని ఫీచర్స్ పూర్తిగా కీబోర్డులోని కంట్రోల్, కాపీ, పేస్ట్ బటన్స్ రూపొందించబడ్డాయని పేర్కొంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ నవ్వుతున్న ఎమోజీతో రీ ట్వీట్ చేశారు.