President Joe Biden : యూఎస్ అన్ని రసాయన ఆయుధాలను నాశనం చేసింది..జో బిడెన్ వెల్లడి

అమెరికా అధ్యక్షుడు జో బిడన్ రసాయన ఆయుధాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేశామని ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు....

President Joe Biden : యూఎస్ అన్ని రసాయన ఆయుధాలను నాశనం చేసింది..జో బిడెన్ వెల్లడి

President Joe Biden

President Joe Biden : అమెరికా అధ్యక్షుడు జో బిడన్ రసాయన ఆయుధాలపై కీలక నిర్ణయం ప్రకటించారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశంలో మూడు దశాబ్దాల నాటి రసాయన ఆయుధాల నిల్వలను పూర్తిగా ధ్వంసం చేశామని ఆ దేశ అధ్యక్షుడు జో బిడెన్ తెలిపారు. (President Joe Biden) ‘‘ఈ రోజు యూఎస్ రసాయన ఆయుధాల మందుగుండు సామాగ్రిని సురక్షితంగా ధ్వంసం చేశామని ప్రకటించడానికి నేను గర్వపడుతున్నాను, రసాయన ఆయుధాల భయం లేని ప్రపంచానికి మేం ఒక అడుగు దగ్గరగా వెళ్లాం’’ అని బిడెన్ చెప్పారు. (US Has Destroyed All Its Chemical Weapons)

Karnataka Heavy Rains : కర్ణాటకలో భారీవర్షాలు..8మంది మృతి

రసాయన ఆయుధాల కన్వెన్షన్ లో సంతకం చేసి, రసాయన ఆయుధాల నిల్వలను నాశనం చేశామని బిడెన్ పేర్కొన్నారు. విధ్వంసక ఆయుధాల మొత్తం వర్గాన్ని నాశనం చేసినట్లు అంతర్జాతీయ సంస్థ ధృవీకరించడం ఇది మొదటిసారి అని బిడెన్ ఒక ప్రకటనలో తెలిపారు. కెంటుకీలోని యుఎస్ ఆర్మీ ఫెసిలిటీ అయిన బ్లూ గ్రాస్ ఆర్మీ డిపోలో ఉన్న 500 టన్నుల ప్రాణాంతక రసాయన ఆయుధాలను నిర్మూలించే పనిని పూర్తి చేశాక బిడెన్ ఈ ప్రకటన పూర్తి చేశారు. మొదటి ప్రపంచ యుద్ధంలో భయంకరమైన ఫలితాలతో రసాయన ఆయుధాల వినియోగాన్ని ఖండించారు.

YS Sharmila : వైఎస్ షర్మిల ఆస్తి పంపకాలు.. ఆ ఇద్దరికి తన ఆస్తులను రాసిచ్చింది

70,000 టన్నులకు పైగా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను నాశనం చేశామని రసాయన ఆయుధాల నిషేధ సంస్థ అధిపతి ఫెర్నాండో అరియాస్ చెప్పారు. యూఎస్ ఆయుధ నియంత్రణ సంఘం ప్రకారం 1990లో యునైటెడ్ స్టేట్స్ 28,600 టన్నుల రసాయన ఆయుధాలుండేవి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రసాయన ఆయుధాలు ధ్వంసమయ్యేలా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని బిడెన్ కోరారు.