Team India New Test Jersey : టీమ్ఇండియా కొత్త జెర్సీ.. మండిప‌డుతున్న ఫ్యాన్స్‌.. దేశం కోసం కాదు.. డ్రీమ్ 11 కోసం ఆడుతున్న‌ట్లు

బుధ‌వారం నుంచి డొమినికా వేదిక‌గా వెస్టిండీస్ జ‌ట్టుతో టీమ్ఇండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియాకు కొత్త జెర్సీ(Team India New Jersey)లు వ‌చ్చాయి.

Team India New Test Jersey : టీమ్ఇండియా కొత్త జెర్సీ.. మండిప‌డుతున్న ఫ్యాన్స్‌.. దేశం కోసం కాదు.. డ్రీమ్ 11 కోసం ఆడుతున్న‌ట్లు

Rohit Kohli Rahane

Team India New Jersey : బుధ‌వారం నుంచి డొమినికా వేదిక‌గా వెస్టిండీస్ జ‌ట్టుతో టీమ్ఇండియా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ కోసం టీమ్ఇండియాకు కొత్త జెర్సీ(Team India New Jersey) వ‌చ్చింది. కొత్త జెర్సీని ధ‌రించిన టీమ్ఇండియా ఆట‌గాళ్లు ఫోటోల‌కు ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అయితే.. కొంద‌రు అభిమానులు కొత్త జెర్సీ పై మండిప‌డుతున్నారు.

WTC ఫైనల్ మ్యాచ్‌ను అప్ప‌టి కిట్ స్పాన్స‌ర్ అడిడాస్ రూపొందించిన జెర్సీల‌తో టీమ్ఇండియా ఆడింది. ఆ జెర్సీకి అభిమానుల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింది. జెర్సీ ముందు భాగంలో దేశం పేరు రాసి ఉండ‌డం ఫ్యాన్స్‌కు న‌చ్చింది. అయితే.. తాజాగా ఆ స్థానంలో స్పాన్స‌ర్ అయిన డ్రీమ్ 11 పేరు ఉంది. ఈ నెల ప్రారంభంలో జ‌ట్టు కొత్త జెర్సీ హ‌క్కుల‌ను పొందింది.

కొత్త జెర్సీలు ధ‌రించిన ఆట‌గాళ్ల ఫోటోలు వైర‌ల్‌గా మార‌గా.. ఈ విష‌యం పై ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) ను తిట్టి పోస్తున్నారు. టెస్టు మ్యాచులు అంటే పూర్తిగా వైట్ క‌ల‌ర్‌లో ఉండాల్సిన జెర్సీలు క్ర‌మంగా రంగుల మ‌యంగా మారుతూ వ‌న్డేల్లో ధ‌రించే జెర్సీల్లా త‌యారు అవుతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దేశం పేరు ఉండాల్సిన స్థానంలో డ్రీమ్ 11 పేరు ఉండ‌డం చూస్తుంటే దేశం కోసం ఆడుతున్న‌ట్లుగా లేద‌ని డ్రీమ్ 11 కోసం ఆడుతున్న‌ట్లుగా ఉంద‌ని ప‌లువురు నెటీజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.

కొత్త ప్ర‌యాణం..

టీమ్ఇండియా ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్(WTC) కొత్త సైకిల్ (2023-2025)  ప్ర‌యాణాన్ని ప్రారంభిస్తోంది. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌తో ఇది ప్రారంభం కానుంది. గ‌త రెండు సెకిల్స్‌లోనూ భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు చేరుకున్న‌ప్ప‌టికి తొలి సారి న్యూజిలాండ్‌, రెండో సారి ఆస్ట్రేలియా చేతిలో ఓటిమి పాలైంది. ఈ సారి కూడా ఫైన‌ల్ చేరుకుని క‌ప్ సాధించాల‌ని అభిమానులు ఆశిస్తున్నారు. సీనియ‌ర్ ఆట‌గాళ్లు లేని విండీస్ జ‌ట్టు పై విజ‌యాలు సాధించి కొత్త సైకిల్ ప్ర‌యాణాన్ని ప్రారంభించాల‌ని కోరుకుంటున్నారు.