Heavy Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

హైదరాబాద్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అనసవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు.

Heavy Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలర్ట్, 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

Telangana Rains

Telangana Red – Orange Alert : తెలంగాణలో గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రహదారులపై భారీగా వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు జలాశయాలు నిండుకుండలా మారాయి.

తాజాగా మరోసాసారి తెలంగాణకు వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువనున్నాయి. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో 11 జిల్లాలకు వాతారణ శాఖ రెడ్ అలర్జ్ జారీ చేసింది. ఇప్పటికే ఉదయం ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, యాదాద్రి-భువనగిరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తాజాగా మరో ఆరు జిల్లాలకు రెడ్ అలర్జ్ జారీ చేసింది.

Heavy Rains : దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక కొమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జనగాం, సిద్ధిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

హైదరాబాద్ లో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని అనసవసరంగా బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. దీంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేసింది.

Nallamala Forest Landslides : నంద్యాల జిల్లాలో భారీ వర్షాలు.. నల్లమల అటవీ ప్రాంతంలో విరిగిపడ్డ కొండచరియలు

సహాయక చర్యలు అందించేందుకు డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగింది. జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కు భారీగా వరద నీర వచ్చి చేరుతోంది. దీంతో ఈ రెండు రిజర్వాయర్ల గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. వాతావరణ శాఖ తాజా హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యగా గండిపేట రిజర్వాయర్ గేట్లను కూడా ఎత్తి వేశారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

నిన్న (బుధవారం) ఉదయం 8:30 గంటల నుంచి ఈరోజు (గురువారం) తెల్లవారుజాము 7 గంటల వరకు రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 616 మిల్లి మీటర్ల భారీ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 10కి పైగా ప్రాంతాల్లో 300 మిల్లీ మీటర్ల నుంచి 500 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది. 50కి పైగా ప్రాంతాల్లో 200 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు అయింది.