Sai Dharam Tej : పవన్ పై మూడు పెళ్లిళ్ల విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడో తెలుసా? అందుకే మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వట్లేదా?

ఓ ఇంటర్వ్యూలో.. పవన్ పై మూడు పెళ్లిళ్లు, ప్యాకేజి స్టార్, దత్తపుత్రుడు అంటూ వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తారు. మీకు కోపం రాదా? మీరు ఎవ్వరూ ఎందుకు రియాక్ట్ అవ్వరు, మీకెలా అనిపిస్తుంది అని తేజ్ ని అడిగారు.

Sai Dharam Tej : పవన్ పై మూడు పెళ్లిళ్ల విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ ఏమన్నాడో తెలుసా? అందుకే మెగా ఫ్యామిలీ రియాక్ట్ అవ్వట్లేదా?

Sai Dharam Tej reacts about Criticizes on Pawan Kalyan Politically

Sai Dharam Tej :  సినిమాల్లో స్టార్ హీరో హోదాలో ఉండి, కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఉండి, ఎవ్వరికి లేనంత ఫ్యాన్స్ ఉండి చక్కగా సినిమాలు చేసుకోకుండా ప్రజలకి మంచి చేయాలని రాజకీయాల్లోకి వచ్చారంటారు పవన్ కళ్యాణ్. అయితే రాజకీయాల్లో ఎవ్వరికైనా విమర్శలు, ప్రతి విమర్శలు తప్పవు. ఇప్పుడు పవన్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. కానీ పవన్ ని వైసీపీ నాయకులు పర్సనల్ గా కూడా టార్గెట్ చేసి మూడు పెళ్ళిళ్ళు అంటూ అనేక విమర్శలు చేస్తూ ఉంటారు. రోజూ ఎవరో ఒకరు ఏపీ నాయకులు పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉంటారు.

అయితే ఈ విమర్శలకు జనసేనలో ఉన్న నాగబాబు తప్ప మెగా ఫ్యామిలిలో ఎవ్వరూ రియాక్ట్ అవ్వరు. అప్పుడప్పుడు పవన్ ఫ్యాన్ కూడా ఈ విమర్శలకు బాధపడతారు. అలాంటిది మెగా ఫ్యామిలిలో ఎవ్వరూ పట్టించుకోరా, ఎవ్వరూ బాధపడట్లేదా అని కామెంట్స్ కూడా వచ్చాయి. తాజాగా ఇలాంటి కామెంట్స్ కి, పవన్ పై వచ్చే విమర్శలకు ఎందుకు స్పందించరో సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు.

తాజాగా పవన్, తేజ్ కలిసి బ్రో సినిమాతో వచ్చి ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పవన్ కళ్యాణ్ గురించి అనేక విషయాలు తెలిపిన తేజ్ ఈ అంశంపై కూడా మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో.. పవన్ పై మూడు పెళ్లిళ్లు, ప్యాకేజి స్టార్, దత్తపుత్రుడు అంటూ వైసీపీ వాళ్ళు విమర్శలు చేస్తారు. మీకు కోపం రాదా? మీరు ఎవ్వరూ ఎందుకు రియాక్ట్ అవ్వరు, మీకెలా అనిపిస్తుంది అని తేజ్ ని అడిగారు.

సాయి ధరమ్ తేజ్ దీనికి సమాధానమిస్తూ.. రాజకీయాల గురించి నేను మాట్లాడలేను. కానీ మామయ్యని అలాంటి మాటలు అంటుంటే చాలా బాధగా ఉంటుంది. అయితే మామయ్య రాజకీయాల్లోకి వెళ్లేముందు నన్ను, చరణ్ ని, వైష్ణవ్ ని, వరుణ్ ని.. ఇలా మా ఫ్యామిలిలో కొంతమందిని పిలిచి నేను పాలిటిక్స్ లోకి వెళ్తే నాపై చాలా విమర్శలు చేస్తారు, ఫ్యామిలీలను కూడా తిడతారు, మీరు అవేమి పట్టించుకోకండి. వాటికి మీరు అస్సలు రియాక్ట్ అవ్వొద్దు. మిడి మిడి జ్ఞానంతో మాట్లాడొద్దు. ఈ విషయంలో మాత్రం నా మాట విని, నన్ను మన్నించండి. నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే మీరు కచ్చితంగా అరియాక్ట్ అవుతారని నాకు తెలుసు, అందుకే ఇలా పిలిచి మరీ చెప్తున్నాను. నా కోసం మీరు కంగారు పడనవసరం లేదు. నన్ను నేను కాపాడుకుంటాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. దాన్ని మీరు నాపై వచ్చే విమర్శలకు స్పందించి నిరూపించుకొనవసరం లేదు అని అన్నారు అంటూ తెలిపాడు.

Akira Nandan : OG సినిమాతో అకిరా ఎంట్రీ ఫిక్స్..? అకిరా ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ వెయిటింగ్..

పవన్ కళ్యాణ్ అలా పిలిచి మరీ రాజకీయాల్లో నన్ను ఏమన్నా పట్టించుకోవద్దు అని చెప్పారు కాబట్టే మెగా ఫ్యామిలీ నుంచి ఎవ్వరూ రియాక్ట్ అవ్వట్లేదని, కానీ చాలా బాధగా ఉంటుందని తేజ్ చెప్పాడు. దీంతో తేజ్ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అందుకే మెగా ఫ్యామిలీ పవన్ పై వచ్చే విమర్శల గురించి రియాక్ట్ అవ్వట్లేదా అని భావిస్తున్నారు జనసేన అభిమానులు.