TSRTC Bill: రాజ్‌భవన్‌లోనే ఆర్టీసీ బిల్లు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ పడుతుందా?

ఒకవేళ గవర్నర్ ఆర్టీసీ బిల్లుపై అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆసక్తి నెలకొంది. 

TSRTC Bill: రాజ్‌భవన్‌లోనే ఆర్టీసీ బిల్లు.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియకు బ్రేక్ పడుతుందా?

TSRTC Bill

Governor Tamilisai : టీఎస్ ఆర్టీసీ (TSRTC) ని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు  తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు ఇటీవల రాష్ట్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఆర్థిక పరమైన బిల్లు కావడంతో ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఆర్టీసీ విలీనం ఫైల్‌ను కేబినెట్ ఆమోదం తరువాత గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ప్రభుత్వం పంపించింది. గవర్నర్ అనుమతి తరువాత అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం వేచిఉంది. అయితే, రెండు రోజులుగా ఈ బిల్లుపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. గవర్నర్ కాన్సెంట్ పొందితేనే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుపై ముందడుగు పడుతుంది.

TSRTC Merger : నెలలోపు విలీనం పూర్తి చేయాలి, కమిటీల పేరుతో కాలయాపన చేయొద్దు- ఆర్టీసీ జేఏసీ డిమాండ్

మరోవైపు రేపటితో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో గవర్నర్ నుంచి బిల్లుకు ఇంకా ఆమోదం లభించకపోవటంతో ప్రభుత్వం వేచి చూస్తుంది. రేపటి వరకు గవర్నర్ నుంచి బిల్లుకు ఆమోదం లభించినా అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీంతో, గవర్నర్ నుంచి ఎలాంటి నిర్ణయం వస్తుంది? ఒకవేళ గవర్నర్ ఆర్టీసీ బిల్లుపై అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆసక్తి నెలకొంది.  మరోవైపు గవర్నర్ తీరుపై బీఆర్ఎస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రజారవాణా వ్యవస్థ బాధ్యతగా భావించి, ఆర్టీసీ కార్మికుల సంక్షేమం లక్ష్యంగా ఆర్టీసీ సంస్థను విలీనం నిర్ణయం తీసుకుంటే గవర్నర్ ఇలా తాత్సారం చేయడంపై సరికాదంటూ పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు.

TSRTC: 43 వేల మంది సిబ్బంది శ్రమకు దక్కిన గౌరవం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఎండీ సజ్జనార్ హర్షం

గతంలోనూ బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్, ప్రభుత్వం మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. గతంలో.. 10 బిల్లులను గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపించింది. అయితే, మూడు బిల్లులు పంచాయతీరాజ్, మున్సిపల్, విద్యాశాఖలకు సంబంధించినవి గవర్నర్ ప్రభుత్వానికి వాపస్ పంపించారు. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో మరో రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపారు.