Tollywood : సెప్టెంబర్‌లో పాన్ ఇండియా సినిమా ఫెస్టివల్.. లవ్, మాస్, హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్..

ఈ ఏడాది సెప్టెంబర్ లో పాన్ ఇండియా సినిమాల ఫెస్టివల్ ఉండబోతుంది. లవ్, మాస్, హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్ అంటూ డిఫరెంట్ జోనర్స్‌లో..

Tollywood : సెప్టెంబర్‌లో పాన్ ఇండియా సినిమా ఫెస్టివల్.. లవ్, మాస్, హారర్, కామెడీ, సైన్స్ ఫిక్షన్..

september pan India movie releases from telugu tamil hindi

Tollywood : సెప్టెంబర్ లో పాన్ ఇండియా సినిమా ఫెస్టివల్ ఉండబోతుంది. ఈ సినిమాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్ లో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాయి. మొదటిగా విజయ్ దేవరకొండ, సమంతల ఖుషి (Kushi) సినిమా థియేటర్ దిగబోతుంది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాని శివ నిర్వాణ డైరెక్ట్ చేయగా సెప్టెంబర్ 1న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ మంచి అంచనాలు క్రియేట్ చేశాయి.

Renu Desai : రేణూ దేశాయ్ పై ఇంకా తగ్గని ట్రోలింగ్.. పవన్ కళ్యాణ్ నిన్ను అందుకే తన్ని తరిమేశాడు..

ఇక ఈ మూవీ తరువాత సెప్టెంబర్ 7న అనుష్క, నవీన్ కలిసి నటిస్తున్న ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు పి.మహేష్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో మాత్రమే రిలీజ్ అవుతుంది.

రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘స్కంద’ (Skanda). శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. అఖండ వంటి బ్లాక్ బస్టర్ తరువాత బోయపాటి ఈ సినిమా తీస్తుండడంతో మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. సెప్టెంబర్ 15న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అభిమాని అత్యుత్సాహం.. బిడ్డని తీసుకోవాలంటూ..

ఇక ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సలార్ (Salaar) కూడా ఇదే నెలలో రాబోతుంది. ప్రశాంత్ నీల్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండడంతో పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలే నెలకొన్నాయి. సెప్టెంబర్ 28న ఈ చిత్రం ఇండియన్ లాంగ్వేజ్స్ తో పాటు ఇంగ్లీష్ అండ్ జపాన్ లాంగ్వేజ్స్ కూడా విడుదల కాబోతుంది.

ఈ తెలుగు చిత్రాలతో పాటు ఇతర భాషల్లో కూడా పలు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. వాటిలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ (Jawan) ఒకటి. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 7న రిలీజ్ కానుంది. అలాగే రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ హారర్ మూవీ చంద్రముఖి 2 (Chandramukhi 2) వినాయక చవితి నాడు రిలీజ్ కాబోతుంది. యాక్షన్ హీరో విశాల్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ మార్క్ ఆంటోనీ (Mark Antony) సెప్టెంబర్ 15న ఆడియన్స్ ముందుకు రానుంది.