Nitin Gadkari: అవినీతి నేతలు పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ మీడియాతో మాట్లాడుతూ 2014 తాము సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చామని, అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ వాగ్దానాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు

Nitin Gadkari: అవినీతి నేతలు పార్టీలో చేరడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి

Nitin Gadkari: కళంకిత నేతలు భారతీయ జనతా పార్టీలో చేరడంపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో గెలుపు చాలా ముఖ్యమని, బలాన్ని పెంచుకోవడానికి రాజీ పడాల్సి ఉంటుందని, తాము కూడా అదే చేస్తున్నామని అన్నారు. తాజాగా ఆయన ఇండియా టుడేతో మాట్లాడుతూ ‘‘ప్రజాస్వామ్యంలో అంకెలు చాలా ముఖ్యమైనవి. అందుకే ఎన్నికల్లో గెలుపు రాజకీయాలు చాలా ముఖ్యం. గెలిస్తే కాబట్టి ఒక్కోసారి పొత్తులు పెట్టుకోవాలి. బలాన్ని పెంచుకోవడానికి రాజీ పడాల్సి వస్తుంది. అందుకే మా కూటమి బలాన్ని కూడా పెంచాలనుకుంటున్నాం’’ అని గడ్కరి అన్నారు.

Telangana Politics : టిక్కెట్ ఎలా ఇవ్వరో చూస్తాం.. మూడు ప్రధాన పార్టీల్లోనూ టిక్కెట్ల లొల్లి..

ఇక ఈయన గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. సరిగ్గా 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఓ మీడియాతో మాట్లాడుతూ 2014 తాము సాధ్యం కాని తప్పుడు హామీలు ఇచ్చామని, అయితే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆ వాగ్దానాలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అప్పట్లో గడ్కరి మాట్లాడుతూ ‘‘మేం సాధ్యం కాని హామీలు ఇచ్చాం. తప్పుడు హామీలు ఇచ్చాం. అయితే ఈ హామీలపై మాకేం భయం లేదు. ఓడిపోతే వాటిపై చర్చ ఉండదు. గెలిస్తే కొద్ది రోజుల్లోనే మర్చిపోతారు’’ అని అన్నారు. కాగా, ఇప్పుడు కూడా సార్వత్రిక ఎన్నికల ముందే గడ్కరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే ఆయన ఆ వ్యాఖ్యలు సెటైరికల్ గా చేసినట్లు బీజేపీ నేతలు చెప్తున్నారు.