Telangana Elections 2023: కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే.. వీరి సంబరాలు మామూలుగా లేవుగా

జగిత్యాల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం నుంచి సీహెచ్. లక్ష్మీనరసింహారావుకు ఎమ్మెల్యే టికెట్ దక్కడంతో..

Telangana Elections 2023: కేసీఆర్ అభ్యర్థుల జాబితా ప్రకటించగానే.. వీరి సంబరాలు మామూలుగా లేవుగా

Telangana Elections 2023

Telangana Elections 2023 – BRS: తెలంగాణ(Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో పలు నియోజక వర్గాల్లో ఆయా అభ్యర్థుల అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఇవాళ హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వేదికగా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితానువిడుదల చేసిన విషయం తెలిసిందే.

ఆ వెంటనే కరీంనగర్ జిల్లా మానకొండూర్ శాసనసభ స్థానంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఆ నియోజక వర్గం నుంచి రసమయి బాలకిషన్ మూడోసారి టికెట్ దక్కించుకున్నారు. ఈ సంబరాల్లో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నేతలు, అభిమానులు పాల్గొన్నారు.

జగిత్యాల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గం నుంచి సీహెచ్. లక్ష్మీనరసింహారావుకు ఎమ్మెల్యే టికెట్ దక్కడంతో కథలాపూర్ మండల కేంద్రంలో ఆయన అభిమానులు, ఇతర నాయకులు పటాకులు పేల్చి, స్వీట్స్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. మునుగోడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ప్రకటించడంతో యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకున్నారు కార్యకర్తలు.

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులోనూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డ్యాన్సులు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మూడోసారి టికెట్ దక్కడంతో టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్నారు. సిద్ధిపేట జిల్లాలోని గజ్వేల్ నుంచి మూడోసారి కేసీఆర్ పోటీ చేయనుండటంతో అంబేద్కర్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు చేశారు ఎఫ్డీసీ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఏఎంచీ ఛైర్మన్ మధాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరును ప్రకటించడంతో ఆయన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు పేరును ప్రకటించడంతో కొత్తగూడెంలో సంబరాలు జరుపుకుంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు, వనమా అభిమానులు.

Telangana Elections 2023: సింహగర్జన సభలో బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటిస్తాం: కేసీఆర్