Vegetable Prices Decline : సెప్టెంబరు నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం: ఆర్‌బీఐ చీఫ్‌ శక్తికాంతదాస్ వెల్లడి

దేశంలో సెప్టెంబరు నెల నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దేశంలో జులై నెలలో కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు....

Vegetable Prices Decline : సెప్టెంబరు నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం: ఆర్‌బీఐ చీఫ్‌ శక్తికాంతదాస్ వెల్లడి

Vegetable Prices Decline

Vegetable Prices Decline : దేశంలో సెప్టెంబరు నెల నుంచి కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. దేశంలో జులై నెలలో కూరగాయలు, తృణధాన్యాల ధరలు పెరగడం వల్ల రిటైల్ ద్రవ్యోల్బణం 7.44 శాతానికి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. (Vegetable Prices In India Likely To Decline) లలిత్ దోషి స్మారకోపన్యాసంలో ఆర్బీఐ గవర్నర్ మాట్లాడారు. పెరుగుతున్న ధరలను తగ్గించేందుకు సరఫరా వైపు దృష్టి సారించాలని కోరారు.

Wagner chief Yevgeny Prigozhin : వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ మాస్కో విమాన ప్రమాదంలో మృతి

టమాటా ధరలు క్రమేణా తగ్గడం, ఉల్లి ధరలు పెరగకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తాయని గవర్నర్ పేర్కొన్నారు. (Reserve Bank of India (RBI) Governor Shaktikanta Das) వాతావరణ ఎల్ నిలో పరిస్థితులు, రాజకీయ ఒత్తిళ్లు, ఆహార పదార్థాల ధరల్లో అనిశ్చితి ఆందోళన కరంగా ఉందని ఆయన చెప్పారు. (inflation)

అమెరికాలో రిలాక్స్ అవుతున్న సమంత..

‘‘సెప్టెంబర్ నెల నుంచి కూరగాయల ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గుతుందని మేం భావిస్తున్నాం’’ అని శక్తికాంత దాస్ చెప్పారు. తరచుగా ఆహార ధరల ద్రవ్యోల్బణం అంచనాలు ప్రమాదాన్ని కలిగిస్తాయని, ఈ ధరల పెంపు గత ఏడాది సెప్టెంబర్ నుంచి కొనసాగుతోందని దీనిపై తాము అప్రమత్తంగా ఉన్నామని శక్తికాంత దాస్ చెప్పారు.