Watermelons : వామ్మో ..అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు, అసలేం జరుగుతోంది..?

అమెరికాలో పుచ్చకాయలు బాంబుల్లా పేలిపోతున్నాయి. దీంతో పుచ్చకాయలు కొనాలంటేనే అమెరికా వాసులు బెంబేలు పడిపోతున్నారు.

Watermelons : వామ్మో ..అమెరికాలో బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు, అసలేం జరుగుతోంది..?

Watermelons Exploding In US

Watermelons Exploding In US : అమెరికాలో ఏం జరుగుతోంది..? అమెరికాలోని పలు ప్రాంతాల్లో పుచ్చకాయలు (Watermelons)ఎందుకు బాంబుల్లా పేలిపోతున్నాయి. మార్కెట్ కు వెళ్లి ఇంటికి తెచ్చుకున్న పుచ్చకాయలు బాంబుల్లా పేలిపోతున్నాయి. దీంతో పుచ్చకాయలు కొనాలంటేనే అమెరికా వాసులు హడలిపోతున్నారట..

అమెరికాలో లీలా ఫాడెల్ (Leila Fadel)అనే ఓ మహిళ మార్కెట్ కు వెళ్లి తెచ్చుకున్న పుచ్చకాయ కిచెన్ లో పెట్టానని కానీ అంతలోనే అది పేలిపోయిందని అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా లీలా ఫాడెల్ కు మాత్రమే కాదు అమెరికాలో పలువురికి ఇటువంటిదే జరిగింది. ఇంటికి తెచ్చుకున్న పుచ్చకాయలు పేలిపోతున్నాయంటూ వాపోతున్నారు. బాంబుల్లా పేలిపోతున్న పుచ్చకాయలు అంటూ సోషల్ మీడియాలో ఈ వార్త హల్ చల్ చేస్తోంది. దీంతో దీనిపై అధ్యయనాలు ప్రారంభమయ్యాయి.

అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఓ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం..పుచ్చకాయ పంటలలో ఒక నిర్దిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని..ఆ బ్యాక్టీరియా సహజ చక్కెర, ఈస్ట్‌ అనే పదార్థాలు ఒకే చోట ఉత్పన్నమవుతున్నాయి తెలిపారు. దీంతో పుచ్చకాయ ఫార్మెంటేషన్ కు గురై ఆ బ్యాక్టీరియా ఉన్న పుచ్చకాయలు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న చోట ఉంచితే.. బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. చివరి ఆ పుచ్చకాయలు ఒక్కసారిగా పేలుతాయని తెలిపారు.

పుచ్చకాయలు పేలుతున్న ఘటనల గురించి  కార్నెల్‌లోని స్కూల్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ ప్లాంట్ సైన్స్‌ (School of Integrative Plant Science )లో హార్టికల్చర్ (Horticulture)ప్రొఫెసర్ డాక్టర్ స్టీవ్ రీనర్స్ (Professor Dr. Steve Reiners )మాట్లాడుతు..పుచ్చకాయలు పేలడానికి ఫార్మెంటేషన్ మాత్రమే కారణం కాదని బ్యాక్టీరియా లేదా ఫంగల్  వ్యాధి కూడా కారణం కావచ్చు అని చెప్పుకొచ్చారు.

అమెరికాలోని అరిజోనా(Arizona), కాలిఫోర్నియా(California), డెలావేర్(Delaware), ఫ్లోరిడా(Florida), టెక్సాస్ (Texas)తో సహా పలుప్రాంతాల్లో పుచ్చకాయలు పడిస్తుంటారు. ఈ ప్రాంతాల్లో పండించే పుచ్చకాయ పంటల్లో వాడే ఒక నిర్దిష్ట రకమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతోందని వాటిని వినియోగదారులు కొని ఇంటికి తీసుకెళ్లాకు అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంలో పెడితే అవి పేలి అవకాశం ఉందని బహుశా ఈ పేలుళ్లకు అదే కారణం కావచ్చని చెబుతున్నారు.