G20 dinner : జి 20 డిన్నర్‌కు మన్‌మోహన్ సింగ్, దేవగౌడ, నితీష్ కుమార్‌కు ఆహ్వానం

జి 20 సదస్సు సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ కు మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవగౌడలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. వీరితోపాటు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా విందుకు ఆహ్వానించారు....

G20 dinner : జి 20 డిన్నర్‌కు మన్‌మోహన్ సింగ్, దేవగౌడ, నితీష్ కుమార్‌కు ఆహ్వానం

G20 dinner

G20 dinner : జి 20 సదస్సు సందర్భంగా భారత రాష్ట్రపతి ఇచ్చే డిన్నర్ కు మాజీ ప్రధానమంత్రులు మన్మోహన్ సింగ్, హెచ్ డీ దేవగౌడలకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపించింది. వీరితోపాటు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కూడా విందుకు ఆహ్వానించారు. (Manmohan Singh, Deve Gowda) ఈ విందుకు ఆహ్వానపత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని కాకుండా భారత్ ప్రెసిడెంట్ అని ఆహ్వానంలో ముద్రించారు. (Nitish Kumar to attend G20 dinner) సదస్సు సందర్భంగా జరగబోయే విందులకు 500 మంది ప్రముఖులను కేంద్రం ఆహ్వానం పంపింది.

Northern Mali : ఉత్తర మాలిలో పడవ, సైనిక స్థావరాలపై అల్‌ఖైదా అనుబంధ సంస్థ జిహాదిస్టుల దాడి…64మంది మృతి

జి20 విందుకు హాజరవ్వాలన్న తృణమూల్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్ణయించుకున్నారు. సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీలో జరగనున్న జీ 20 సమ్మిట్‌లో యూఎస్, యూకే, కెనడా, యూరోపియన్ యూనియన్‌తో సహా వివిధ దేశాలకు చెందిన అగ్రనేతలకు ఆతిథ్యం ఇవ్వనున్నారు. రాష్ట్రపతి నిర్వహించే జి 20 డిన్నర్‌కు కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లికార్జున్ ఖర్గేకు ఆహ్వానం లేదు. కేబినెట్, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులందరినీ విందుకు ఆహ్వానించారు. ఖర్గేకు కేంద్ర కేబినెట్ మంత్రి హోదా ఉంది. దేశంలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు.

G20 Summit : స్పానిష్ అధ్యక్షుడు పెడ్రో సంచెజ్‌కు కరోనా…జి 20 సదస్సుకు డుమ్మా

మరే ఇతర రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం అందలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. కేబినెట్, రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రులందరినీ విందుకు ఆహ్వానించారు. భారత ప్రభుత్వ కార్యదర్శులందరూ,పెద్ద పారిశ్రామికవేత్తలతో సహా ఇతర ప్రముఖ అతిథులు కూడా అతిథి జాబితాలో ఉన్నారు. బీహార్‌కు చెందిన నితీష్ కుమార్, జార్ఖండ్ నుంచి హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ, తమిళనాడు నుంచి ఎంకే స్టాలిన్, ఢిల్లీ నుంచి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ నుంచి భగవంత్ మాన్ విందుకు హాజరవుతారని ధృవీకరించిన ముఖ్యమంత్రుల్లో ఉన్నారు.

The Beast: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కారు చాలా పవర్‭ఫుల్.. మన కార్లన్నీ బలాదూర్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్ని దేశాల నాయకులకు వ్యక్తిగతంగా వేదిక వద్దకు స్వాగతం పలుకుతారు. అక్కడ వారికి శనివారం వర్కింగ్ లంచ్ కూడా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. శనివారం భారత్ మండపంలో రెండు సెషన్‌లు జరగనుండగా ప్రధాని మోదీ ఉదయం 9 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు.