ODI World Cup : ప్ర‌పంచ‌క‌ప్‌కు అంపైర్లు వీరే.. లిస్ట్‌లో ఐర‌న్ లెగ్ అంపైర్‌..! టీమ్ఇండియాకు క‌ష్ట‌కాల‌మే..!

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీలో అంఫైరింగ్ విధులు నిర్వ‌ర్తించే వారి జాబితాను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్ర‌క‌టించింది.

ODI World Cup : ప్ర‌పంచ‌క‌ప్‌కు అంపైర్లు వీరే.. లిస్ట్‌లో ఐర‌న్ లెగ్ అంపైర్‌..! టీమ్ఇండియాకు క‌ష్ట‌కాల‌మే..!

Richard Kettleborough

ODI World Cup 2023 : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 జ‌ర‌గ‌నుంది. ఈ మెగా టోర్నీలో అంఫైరింగ్ విధులు నిర్వ‌ర్తించే వారి జాబితాను అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్ర‌క‌టించింది. ఈ జాబితాలో 16 మందికి చోటిచ్చింది. అయితే.. భార‌త్ నుంచి ఒక్క నితిన్ మీన‌న్‌కు మాత్ర‌మే చోటు ద‌క్కింది. అక్టోబర్ 5న టోర్నీ ఆరంభ మ్యాచ్ అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియంలో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్ మధ్య జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్‌కు నితిన్ మేనన్‌తో పాటు శ్రీలంకకు చెందిన కుమార ధర్మసేన అంపైరింగ్ విధులు నిర్వ‌ర్తించ‌నున్నారు.

Sunil Gavaskar: టీమిండియాలో ఎవరు ఉండాలో, ఉండొద్దో చెప్పడానికి మీరెవరండీ?: సునీల్ గవాస్కర్

మొత్తం 16 మంది అంపైర్ల‌లో 12 మంది ఐసీసీకి చెందిన ఎమిరేట్స్ ఎలైట్ ప్యానెల్ కు చెందిన అంపైర్లు కాగా.. మరో నలుగురు ఐసీసీ ఎమర్జింగ్ అంపైర్ ప్యానెల్ కు చెందిన వాళ్లు. నితీన్ మీనన్‌, కుమార ధర్మసేన, మరైస్ ఎరస్మాస్, క్రిస్ బ్రౌన్, క్రిస్ గాఫనే, మైకేల్ గాఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్, రిచర్డ్ కెటిల్ బరో, అడ్రియన్ హోల్డ్ స్టాక్, అహ్‌సన్ రజా, పాల్ రిఫెల్, షర్ఫుద్దౌలా ఇబ్నే షెయిద్, రాడ్ టక్కర్, అలెక్స్ వార్ఫ్, జోయిల్ విల్సన్, పాల్స్ విల్సన్ లు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అంపైరింగ్ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నున్నారు.

బాబాయ్‌.. ఈ అంపైర్ మాకొద్దు..

అంపైర్ల జాబితాలో రిచర్డ్ కెటిల్ బరో పేరు చూసి భార‌త క్రికెట్ అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అత‌డు భార‌త్ ఆడే మ్యాచుల‌కు అంపైరింగ్‌ విధులు నిర్వ‌ర్తించ‌కుండా చూడాల‌ని సోష‌ల్ మీడియాలో విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఎందుకంటే రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన ఐసీసీ నాకౌట్ మ్యాచుల్లో టీమ్ఇండియా ఓడిపోవ‌డ‌మే అందుకు కార‌ణం.

MS Dhoni and Donald Trump: ఇండియాలో జో బైడెన్.. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్‌తో గోల్ఫ్ ఆడిన ఎంఎస్ ధోని.. వీడియో వైరల్

2014 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి 2023 ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ వ‌ర‌కు రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ చేసిన మ్యాచుల్లో టీమ్ఇండియా గెల‌వ‌లేదు.

– 2014 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌లో శ్రీలంక చేతిలో ధోని నేతృత్వంలోని టీమ్ఇండియా 6 వికెట్ల తేడాతో ఓట‌మిపాలైంది.
– 2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 95 ప‌రుగుల తేడాతో భార‌త్ ఓడిపోయింది
– 2016 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌లో వెస్టిండీస్ చేతిలో 7 వికెట్ల తేడాతో భార‌త జ‌ట్టు ఓడిపోయింది.
– ఐసీసీ ఈవెంట్ల‌లో పాకిస్తాన్ చేతిలో ఎప్పుడూ ఓడిపోని భార‌త్ మొద‌టి సారి 2017 చాంపియ‌న్ ట్రోఫీ ఫైన‌ల్‌లో 180 ప‌రుగుల‌తో ఘోర ఓట‌మిని చ‌విచూసింది.
– 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌లో న్యూజిలాండ్ చేతిలో భార‌త్ ఓడిపోయింది. ఆ మ్యాచులో మ‌హేంద్ర సింగ్ ధోని ర‌నౌట్ అయిన‌ప్పుడు లెగ్ అంపైర్‌గా ఉన్న కెటిల్.. అయ్యో అంటూ ఇచ్చిన ఎక్స్‌ప్రెష‌న్స్‌ను భార‌త అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు.

Glenn McGrath: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంట్లోకి చొరబడ్డ పైథాన్.. తోకపట్టుకొని బయటపడేసిన క్రికెటర్.. వీడియో వైరల్

టీవీ అంపైరింగ్ చేసినప్పుడు కూడా..

పై మ్యాచుల‌కు అన్నింటిలో రిచర్డ్ కెటిల్ బరో అంపైరింగ్ విధులు నిర్వ‌ర్తించాడు. అయితే.. అత‌డు టీవీ అంపైర్‌గా ఉన్న‌ప్పుడు కూడా భార‌త జ‌ట్టు ఓడిపోయింది. 2021 ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచులో న్యూజిలాండ్ చేతిలో, 2023 వ‌రల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ పైన‌ల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

దీంతో రిచర్డ్ కెటిల్ బరో ను భార‌త అభిమానులు ఐర‌న్ లెగ్ అంపైర్‌గా విమ‌ర్శిస్తుంటారు. ఇప్పుడు ప్ర‌పంచ‌కప్‌కు అత‌డిని ఐసీసీ ఎంపిక చేయ‌డంతో భార‌త్ ఆడే మ్యాచుల‌కు మాత్రం అత‌డిని అంపైర్‌గా విధులు నిర్వ‌ర్తించ‌కుండా చూడాల‌ని నెటీజ‌న్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా కోరుతున్నారు. ఒక‌వేళ గ‌నుక అత‌డు టీమ్ఇండియా ఆడే మ్యాచుల‌కు అంపైరింగ్ చేస్తే ప్ర‌పంచ‌క‌ప్‌పై భార‌త్ ఆశ‌లు వ‌దుల‌కోవాల్సిందేన‌ని అంటున్నారు.

Nicholas Pooran : నికోల‌స్ పూర‌న్ ఊచ‌కోత‌.. సెంచ‌రీ త‌రువాత సెల‌బ్రేష‌న్స్ వైర‌ల్‌