David Warner సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్.. అదెంటో తెలుసా?

ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.. సచిన్ టెండూల్కర్ ను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించాడు.

David Warner సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేసిన డేవిడ్ వార్నర్.. అదెంటో తెలుసా?

David Warner Breaks Sachin Tendulkar All Time Record With Century

David Warner Record: ఆస్ట్రేలియా బ్యాటర్ డేవిడ్ వార్నర్ మరో ఘనత సాధించాడు. భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) రికార్డును బ్రేక్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో (International Cricket) 46వ సెంచరీ కొట్టి లేటెస్ట్ రికార్డును తన పేరిట లిఖించాడు. సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో వార్నర్ సెంచరీ బాదాడు. 113.97 స్టైక్ రేటుతో 93 బంతుల్లో 3 సిక్సర్లు, 12 ఫోర్లతో 106 పరుగులు చేశాడు. దీంతో అతడు ఇప్పటివరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో 46 సెంచరీలు తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో 20, టెస్టుల్లో 21, టీ20ల్లో ఒక సెంచరీ సాధించాడు.

ప్రపంచ క్రికెట్ లో ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు కొట్టిన బ్యాటర్ గా డేవిడ్ వార్నర్ తాజాగా రికార్డుకెక్కాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. ఓపెనర్ గా సచిన్ 45 సెంచరీలు బాదాడు. అయితే ఇవన్నీ వన్డేల్లోనే సాధించడం విశేషం. ఓవరాల్ గా అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల లిస్టులో ఇంగ్లండ్ ప్లేయర్ జోరూట్ తో కలిసి 11వ ప్లేస్ లో వార్నర్ కొనసాగుతున్నాడు. జోరూట్.. టెస్టుల్లో 30, వన్డేల్లో 16 సెంచరీలు సాధించాడు.

రోహిత్ శర్మ,(Rohit Sharma) స్టీవెన్ స్మిత్ 10వ స్థానంలో ఉన్నారు. రోహిత్.. వన్డేల్లో 30, టెస్టుల్లో 10, టీ20ల్లో 4 సెంచరీలు చేశాడు. స్మిత్ టెస్టుల్లో 32, వన్డేల్లో 12 శతకాలు బాదాడు. అత్యధిక సెంచరీల జాబితాలో సచిన్(100), విరాల్ కోహ్లి(76), రికీ పాంటింగ్(71), కుమార సంగక్కర(63), కల్లిస్(62) టాప్5లో కొనసాగుతున్నారు.

అలాగే, మాథ్యూ హేడెన్‌ను అధిగమించి ఆస్ట్రేలియా తరపున ఎనిమిదో అత్యధిక ODI పరుగుల స్కోరర్‌గా వార్నర్ నిలిచాడు. వార్నర్ 144 వన్డేల్లో 45.11 సగటుతో 6,136 పరుగులు సాధించారు. ఇందులో 20 సెంచరీలు, 27 అర్ధసెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 179. హేడెన్ 160 ODIల్లో 44.10 సగటుతో 10 సెంచరీలు, 36 అర్ధసెంచరీలతో 6,131 పరుగులు చేశాడు.

Also Read: జ‌ట్టుకు దూరం చేసినా.. ఆల‌యంలో శిఖ‌ర్ ధావ‌న్ పూజ‌లు.. ఏం కోరుకున్నాడో తెలుసా..?