Asia Cup 2023: శ్రీలంకపై మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్స్ సరికొత్త రికార్డులు.. ఆ లిస్ట్‌లో రోహిత్, కుల్దీప్, జడేజాలు

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా శ్రీలంక‌తో జరిగిన మ్యాచ్‌లో 2012 నాటి ఇర్ఫాన్ పటాన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆసియా కప్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా ./

Asia Cup 2023: శ్రీలంకపై మ్యాచ్‌లో టీమిండియా ప్లేయర్స్ సరికొత్త రికార్డులు.. ఆ లిస్ట్‌లో రోహిత్, కుల్దీప్, జడేజాలు

Rohit Sharma

India vs Sri Lanka Match: ఆసియా కప్ 2023 టోర్నీలో భాగంగా సూపర్ 4లో మంగళవారం రాత్రి భారత్ వర్సెస్ శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా రాణించడంతో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.1 ఓవర్లకు 213 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. తరువాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 41.3 ఓవర్లకు కేవలం 172 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు 41 పరుగుల తేడాతో లంక జట్టుపై విజయం సాధించింది. ఈ విజయంతో ఆసియాకప్ 2023 టోర్నీలో టీమిండియా దాదాపు ఫైనల్‌కు చేరింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో పలువురు భారత్ ప్లేయర్స్ సరికొత్త రికార్డును సృష్టించారు.

Rohit Sharma

Rohit Sharma

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో మరో ఘనత సాధించాడు. పది వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో రజిత వేసిన ఏడో ఓవర్లో సిక్సర్ తో రోహిత్ పదివేల పరుగుల క్లబ్‌లో చేరాడు. దీంతో టీమిండియా బ్యాటర్లలో పదివేల పరుగుల క్లబ్ లో చేరిన ఆరో ప్లేయర్ గా రోహిత్ ఘనత సాధించాడు. ప్రపంచ క్రికెట్ లో మాత్రం పదివేల క్లబ్ లో చేరిన 15 బ్యాటర్ రోహిత్. అతను 241 ఇన్నింగ్స్‌లో 10వేల పరుగులు పూర్తి చేశాడు. ఇండియా ప్లేయర్స్ లో రోహిత్ కంటే ముందు సచిన్ 18,426 పరుగులు, విరాట్ కోహ్లీ 13,026 పరుగులు, గంగూలీ 11,363 పరుగులు, ద్రవిడ్ 10,889 పరుగులు, ఎం.ఎస్. ధోనీ 10,773 పరుగులు చేశారు. తాజాగా రోహిత్ శర్మ 10,031 పరుగులు చేశాడు.

Kuldeep Yadav

Kuldeep Yadav

శ్రీలంకతో జరిగిన వన్డేలో కుల్‌దీప్ యాదవ్ తన స్పిన్ మాయాజాలంతో ఆకట్టుకున్నాడు. 43 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో అరుదైన ఘనత సాధించాడు. భారత జట్టు తరపున తక్కువ మ్యాచ్‌లలో 150 వికెట్లను పడగొట్టిన రెండో బౌలర్‌గా కుల్దీప్ యాదవ్ రికార్డు సృష్టించాడు. భారత్ తరపున 150 వన్డే వికెట్లను పడగొట్టిన ఆటగాళ్ల లిస్టులో ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి మొదటి స్థానంలో ఉన్నారు. షమీ 80 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించగా.. కుల్దీప్ యాదవ్ 88వ మ్యాచ్‌లో 150 వికెట్లు పడగొట్టాడు. వన్డే ఫార్మాట్‌లో 150 వికెట్లు తీసిన భారతీయ బౌలర్లలో మరికొందరు ఉన్నారు. వారిలో అగార్కర్ 97 మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించగా.. జహీర్‌ఖాన్ 103, కుంబ్లే 106, ఇర్ఫాన్ 106 మ్యాచ్‌లలో ఈ ఫీట్‌ను అందుకున్నారు.

Ravindra Jadeja

Ravindra Jadeja

టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా శ్రీలంక‌తో జరిగిన మ్యాచ్‌లో 2012 నాటి ఇర్ఫాన్ పటాన్ రికార్డును బ్రేక్ చేశాడు. ఆసియా కప్ లో భారత్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ గా జడేజా అవతరించాడు. అంతకుముందు మాజీ ప్లేయర్ ఇన్ఫాన్ పఠాన్ ఉండేవాడు. ఆసియా కప్ టోర్నీలో భారత తరపున 12 మ్యాచ్ లు ఆడిన ఇర్ఫాన్ మొత్తం 22 వికెట్లు తీయగా.. జడేజా 18 మ్యాచ్ లలో 24 వికెట్లు పడగొట్టాడు.