Apple Wonderlust Event : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్.. భారత్‌లో ఈ 4 ఐఫోన్ మోడల్స్ నిలిపివేసింది.. మీరు వాడే ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Apple Wonderlust Event : ఎట్టకేలకు ఆపిల్ ఐఫోన్ 15 వచ్చేసింది. భారతీయ మార్కెట్లో తన అనేక ఐఫోన్ మోడల్‌లను అధికారికంగా నిలిపివేసింది. ఈ 4 ఐఫోన్ మోడల్స్‌కు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Apple Wonderlust Event : ఆపిల్ ఐఫోన్ 15 లాంచ్.. భారత్‌లో ఈ 4 ఐఫోన్ మోడల్స్ నిలిపివేసింది.. మీరు వాడే ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!

Apple discountinues 4 iPhones in India after iPhone 15 launch, here are the details

Apple Wonderlust Event : ప్రముఖ ఐటీ దిగ్గజం ఆపిల్ (Apple ) లేటెస్ట్ వండర్లస్ట్ ఈవెంట్‌లో ఎట్టకేలకు కొత్త ఐఫోన్ 15 సిరీస్‌ (Apple iPhone 15 Series)ను ప్రకటించింది. ఆపిల్ భారతీయ మార్కెట్లో అనేక ఐఫోన్ మోడల్‌లను అధికారికంగా నిలిపివేసింది. తద్వారా ఐఫోన్ 15 సిరీస్‌కు మార్గం సుగమం అయింది.

దశలవారీగా తొలగిస్తున్న ఐఫోన్ మోడల్‌లలో iPhone 12, iPhone 13 mini, iPhone 14 Pro, iPhone 14 Pro Max ఉన్నాయి. గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ రూ. 1,39,900 ధరతో లాంచ్ కాగా.. ఇప్పుడు, ఆపిల్ అధికారిక వెబ్‌సైట్ నుంచి తొలగించింది. అదేవిధంగా, గత ఏడాదిలో ‘ఫార్ అవుట్’ ఈవెంట్‌లో ప్రవేశపెట్టిన ఐఫోన్ 14 ప్రో ప్రారంభ ధర రూ. 1,29,900 భారత మార్కెట్‌లో కూడా నిలిపివేసింది.

Read Also : Apple AirPods Pro Launch : ఆపిల్ ‘వండర్‌లస్ట్’ ఈవెంట్.. USB-C ఛార్జింగ్‌తో ఎయిర్ పాడ్స్ ప్రో ఇదిగో.. ఫస్ట్ సేల్ ఎప్పటినుంచంటే?

ఆపిల్ ఐఫోన్ 13 మినీకి కూడా వీడ్కోలు పలికింది. 2021 ఐఫోన్ లైనప్‌లో సరసమైన ధరకు అందించింది. 128GB స్టోరేజ్ మోడల్‌ ప్రారంభ ధర రూ. 69,900గా ఉంది. లేటెస్ట్ ఐఫోన్ 15 మోడల్‌ అద్భుతమైన ఫీచర్లు, అప్‌గ్రేడ్‌లతో వస్తుంది. నిలిపివేసిన ఐఫోన్లలో పాత మోడల్ iPhone 12 కూడా ఉంది. 2020లో ఐఫోన్ 12 బేస్ 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 59,900 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇకపై ఆపిల్ లైనప్‌లో అందుబాటులో ఉండదని కంపెనీ పేర్కొంది.

Apple discountinues 4 iPhones in India after iPhone 15 launch, here are the details

Apple Wonderlust Event : discountinues 4 iPhones in India after iPhone 15 launch, here are the details

అయినప్పటికీ, ఇప్పటికీ ఈ పాత ఐఫోన్ మోడల్‌లపై ఆసక్తి ఉన్నవారికి అందుబాటులో ఉంది. ఇప్పటికీ థర్డ్-పార్టీ రిటైలర్లు, Amazon, Flipkart వంటి ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చు. మోర్టార్ షాపుల్లో కూడా ఈ పాత ఐఫోన్ మోడళ్లను ప్రస్తుత స్టాక్‌లు అయిపోయే వరకు విక్రయిస్తున్నాయి. ఈ మోడళ్లను నిలిపివేయాలని ఆపిల్ నిర్ణయం తీసుకున్న క్రమంలో భారతీయ మార్కెట్లో కొత్త, వినూత్నమైన ప్రొడక్టులను అందిస్తుంది. వినియోగదారులకు వారి డివైజ్‌లలో లేటెస్ట్ టెక్నాలజీ, ఫీచర్‌లకు యాక్సస్ ఉంటుంది.

భారత్‌లో ఐఫోన్ 15 ప్రారంభ ధర రూ. 79,900 ఉండగా.. iPhone 15 Plus పోటీ ధర రూ. 89,900కు అందిస్తోంది. టాప్ రేంజ్ పర్ఫార్మెన్స్, అత్యాధునిక ఫీచర్లను కోరుకునే వారికి, ఐఫోన్ 15 ప్రో ప్రారంభ ధర రూ. 1,34,900తో అందుబాటులో ఉంటుంది. అయితే, ఆపిల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఐఫోన్ 15 Pro Max రూ. 1,59,900 నుంచి ప్రారంభమవుతుంది. ప్రీ-ఆర్డర్‌ల ద్వారా కస్టమర్‌లు ఐఫోన్ 15 మోడళ్లను బుకింగ్‌ చేసుకోవచ్చు. ఈ కొత్త ఐఫోన్ 15 సిరీస్ అధికారిక సేల్ సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభం కానుంది.

Read Also : Apple Watch Series 9 : కొంటే ఆపిల్ వాచ్ కొనాల్సిందే.. కొత్త ఆపిల్ వాచ్ సిరీస్ 9, అల్ట్రా 2 వాచ్.. కొత్త సెన్సార్లు, మరెన్నో ఫీచర్లు, ధర ఎంతంటే?