Nara Lokesh : జగన్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైంది, ఇక కలిసికట్టుగా పోరాటం-నారా లోకేశ్

ముఖ్యమంత్రిగా జగన్ తొలి నిర్ణయమే అరాచకం. ప్రజావేదిక పడగొట్టడం నుంచి చంద్రబాబుని రిమాండ్ కు పంపే వరకూ... Nara Lokesh - CM Jagan

Nara Lokesh : జగన్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైంది, ఇక కలిసికట్టుగా పోరాటం-నారా లోకేశ్

Nara Lokesh - CM Jagan

Nara Lokesh – CM Jagan : జగన్ ప్రభుత్వంపై యుద్ధం మొదలైందని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. ఈ ప్రభుత్వంపై యుద్ధం మొదలు పెట్టాలని చంద్రబాబు, పవన కల్యాణ్, బాలకృష్ణ, నేను కలిసి నిర్ణయించాము అని లోకేశ్ తెలిపారు. ఈ నిర్ణయం ఏపీ ప్రజల భవిష్యత్తు కోసం, వారు హాయిగా ఉండేందుకే అన్నారు. మా సివిల్ వార్ ను ముందుకు తీసుకెళ్లేందుకు ఒక కమిటీ వేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుని పవన్ కల్యాణ్, నారా లోకేశ్, బాలకృష్ణ కలిశారు. చంద్రబాబుతో భేటీ తర్వాత నారా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ టార్గెట్ గా లోకేశ్ చెలరేగిపోయారు.

”చంద్రబాబు జైల్లో ఉన్నా సింహంలానే ధైర్యంగా ఉన్నారు, జగన్ కే నిద్ర పట్టడం లేదు. జగనే మానసిక వికలాంగుడు. కాబట్టి ముఖ్యమంత్రిగా అన్ స్టేబుల్ అని చంద్రబాబు అన్నారు. చంద్రబాబు కట్టిన జైలులోనే ఆయన్ని కట్టేశారు. తెలుగుదేశం-జనసేన కార్యకర్తలపైన, నాపైన, పవన్ కల్యాణ్ పైన ఎన్నో కేసులు పెట్టారు. ముఖ్యమంత్రిగా జగన్ తొలి నిర్ణయమే అరాచకం. ప్రజావేదిక పడగొట్టడం నుంచి చంద్రబాబుని రిమాండ్ కు పంపే వరకూ సైకో చర్యలకే పాల్పడ్డారు. ప్రభుత్వ ఇబ్బందుల వల్ల నష్టపోయిన బాధ్యులపై ఏ కేసులూ లేవు. గంజాయి స్మగ్లర్లు, మాఫియాలపై కేసులు లేవు” అని ధ్వజమెత్తారు లోకేశ్.

Also Read..TDP Janasena Alliance: పూర్తిగా ఓపెన్ అయిన పవన్ కళ్యాణ్.. తర్వాత ఏం జరగబోతోంది?

”ఏపీ చరిత్రలో ఇది కీలక నిర్ణయం. కలిసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించాం. టీడీపీ, జనసేన కలిసి యుద్ధానికి సిద్ధమవుతాయి. జగన్ పాలనలో ఎన్నో అరాచకాలు జరిగాయి. ఏ ఒక్క అరాచకంపైనా కేసు నమోదు కాలేదు. ఆధారాలు లేకుండా స్కామ్ జరిగిందని చంద్రబాబుపై కేసు పెట్టారు. ప్రజలు అంతా గమనిస్తున్నారు. జగన్ కు బుద్ధి చెబుతారు” అని నారా లోకేశ్ హెచ్చరించారు.

Also Read..Pawan Kalyan: జైల్లో చంద్రబాబు భద్రత విషయంపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తులపై ఓపెన్ అయిపోయారు. ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వాన్ని ఢీకొట్టాలంటే టీడీపీతో చేతులు కలపాల్సిందే అన్నారు. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని జనసేనాని కోరారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుని గురువారం(సెప్టెంబర్ 14) మధ్యాహ్నం పవన్ కలిశారు. నందమూరి బాలకష్ణ, (Nandamuri Balakrishna) నారా లోకేశ్ తో (Nara Lokesh) కలిసి.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. పొత్తులపై స్పష్టం ఇచ్చారు పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే వెళ్తాయని తేల్చి చెప్పారు.

”వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్తాయి. చంద్రబాబుతో ములాఖత్ రాష్ట్రానికి చాలా కీలకమైనది. నేను ఎన్డీయేలో ఉన్నాను. 2024లో ఈ అరాచక పాలన నుంచి బయటపడాలంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి వెళ్లాలని నా కోరిక. బీజేపీ దీనిపై పాజిటివ్ నిర్ణయం తీసుకుంటుందని అనుకుంటున్నారు. ఈ అడ్డగోలు దోపిడీని ఎదుర్కోవాలంటే విడివిడిగా పోటీ చేస్తే పని చేయదు” అని పవన్ కల్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.

టీడీపీతో పొత్తుపై పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టడంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, జనసేన నాయకులు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా.. అధికార వైసీపీ నాయకులు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ప్యాకేజ్ బంధం బయటపడిందని.. పవన్ కళ్యాణ్ పై భ్రమలు తొలగిపోయాయని మాటల యుద్ధానికి దిగారు. టీడీపీ జనసేన పొత్తుపై స్పష్టత రావడంతో తర్వాత అడుగు ఎలా ఉండబోతుందన్న చర్చ సర్వత్రా మొదలైంది.