Nara Lokesh: అసలు నారా లోకేశ్ హస్తినకు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం చేస్తున్నారు?

చంద్రబాబు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లి వారం రోజులవుతోంది. అనుకున్న పని కాకపోవడం వల్లే ఇంకా తిరిగి రాలేదా?

Nara Lokesh: అసలు నారా లోకేశ్ హస్తినకు ఎందుకు వెళ్లారు.. అక్కడ ఏం చేస్తున్నారు?

why nara lokesh went to delhi what he doing there

Nara Lokesh in Delhi: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. యువగళం పాదయాత్రను (Yuvagalam Padayatra) ఆపేసిన లోకేశ్.. రెండ్రోజులకే ఢిల్లీకి పయనమయ్యారు. (Lokesh Delhi Visit) అసలు లోకేశ్ హస్తినకు ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేస్తున్నారు? వారం రోజులైనా తాము అనుకున్న పని కాకపోవడం వల్లే ఇంకా తిరిగి రాలేదా? ఈ తెరవెనుక రాజకీయం తెలుసుకుందాం రండి.

చంద్రబాబు కుమారుడు, టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీకి వెళ్లి వారం రోజులవుతోంది. తొలుత జాతీయ మీడియా సంస్థల ద్వారా స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కొందరు ఢిల్లీ పెద్దలను కలిసేందుకు ప్రయత్నించారాయన. అయితే.. లోకేశ్ ఢిల్లీ వెళ్లిన సమయంలో ముఖ్య నాయకులెవరూ అందుబాటులో లేరు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శనివారం సాయంత్రమే హైదరాబాద్‌ వచ్చారు. దీంతో ఆయన్ను కలిసేందుకు లోకేశ్‌కు అవకాశం లేకుండా పోయింది.

ఈ నేపథ్యంలో టీడీపీ నేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ.. కేసుల విషయంలో ఎలా ముందుకు సాగాలో చర్చిస్తూ వస్తున్నారు లోకేశ్. ఈ సమయంలో టీడీపీకి మద్దతుగా ఉన్న బీజేడీ, శివసేన, హర్యానా డిప్యూటీ సీఎం వంటి వారు లోకేశ్‌కు సంఘీభావం ప్రకటించారు. అయితే.. పార్లమెంటు సెషన్స్ సందర్భంగా టీడీపీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కలిసి లోకేశ్ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఏపీలో సేవ్ డెమోక్రసీ అంటూ నల్ల రిబ్బన్స్ ధరించి నినాదాలు చేశారు. పార్లమెంటు వేదికగా ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను తమ ఎంపీల ద్వారా వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు లోకేశ్.

Also Read: టీడీపీ ముందున్న ఏకైక మార్గం అదేనా.. వారిద్దరినీ ప్రజాక్షేత్రంలోకి తీసుకొస్తారా?

మరోవైపు.. చంద్రబాబును ఎలాగైనా జైలు నుంచి విడిపించేందుకు ఢిల్లీ కేంద్రంగా లోకేశ్ ప్రయత్నాలు చేస్తున్నారు. క్వాష్ పిటిషన్‌పై ఆశించిన తీర్పు రాకపోడంతో సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు అవసరమైన న్యాయ నిపుణులతో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు సమాచారం.

Also Read: జనసేనాని డైరెక్షన్‌.. వచ్చే ఎన్నికలకు పవన్ కళ్యాణ్ సరికొత్త రూట్ మ్యాప్!

ఎన్డీఏ మిత్రపక్షంగా ఉన్న టీడీపీకి.. చంద్రబాబు విషయంలో ఆశించిన స్థాయి మద్దతు దక్కలేదనే చెప్పొచ్చు. ఒకప్పుడు ఎన్డీఏ కన్వీనర్‌గా కేంద్రంలో చక్రం తిప్పిన బాబు.. పలుమార్లు ఆ కూటమి నుంచి వైదొలగడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు.. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుంచి కూడా చంద్రబాబు విషయంలో పెద్దగా స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో లోకేశ్ హస్తిన పర్యటన ఏ మేరకు సఫలం అవుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.