Narendra Modi: తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం: ఎన్నికల వేళ మోదీ వరాల వర్షం

సమ్మక్క సారక్క పేరుతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

Narendra Modi: తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం: ఎన్నికల వేళ మోదీ వరాల వర్షం

Narendra Modi

Turmeric Board: తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. కరోనా విజృంభణ తర్వాత పసుపు గొప్పదనం ప్రపంచానికి మరింతగా తెలిసిందని అన్నారు. కరోనా తర్వాత ఆ పంటపై పరిశోధనలు జరిగాయని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే రైతులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. తెలంగాణలో పసుపు రైతుల సంక్షేమసం కోసం తాము కృషి చేస్తామని తెలిపారు.

మహబూబ్ నగర్ జిల్లాలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణపై వరాల వర్షం కురిపించారు. ములుగు జిల్లాలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆదీవాసీ దేవతల పేరు పెడుతున్నామని చెప్పారు. గిరిజన వర్సిటీకి రూ.900 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.

సమ్మక్క సారక్క పేరుతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. కాగా, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో పసుపు బాగా పండుతుంది. పసుపు బోర్డు ఉంటే రైతులకు మేలు జరుగుతుందని చాలాకాలంగా కోరుతున్నారు.

మరోవైపు, సూర్యపేట-ఖమ్మం జాతీయ రహదారిని మోదీ జాతికి అంకితం చేశారు. కృష్ణపట్నం-హైదరాబాద్ మల్లీ ప్రాడెక్ట్ పైప్ లైనును ప్రారంభించారు. అలాగే, జక్లేర్ కృష్ణ కొత్త లైన్ ను జాతికి అంకితం చేశారు.

Narendra Modi: స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ, షా, నడ్డా