ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ఒక్క మ్యాచే గెలిచిన అఫ్గాన్‌.. ఈ సారి మూడు రోజుల ముందు కీల‌క నిర్ణ‌యం

భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి మ‌రో మూడు రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉండ‌గా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ODI World Cup 2023 : ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ఒక్క మ్యాచే గెలిచిన అఫ్గాన్‌.. ఈ సారి మూడు రోజుల ముందు కీల‌క నిర్ణ‌యం

Ajay Jadeja as team mentor for Afghanistan

ODI World Cup : భార‌త్ వేదిక‌గా అక్టోబ‌ర్ 5 నుంచి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) ఆరంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి మ‌రో మూడు రోజుల స‌మ‌యం మాత్ర‌మే మిగిలి ఉండ‌గా అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (Afghanistan Cricket Board) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజ‌య్ జ‌డేజా (Ajay Jadeja) ను అఫ్గానిస్థాన్ క్రికెట్ జ‌ట్టు టీమ్ మెంటర్‌గా నియ‌మించింది. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో అఫ్గాన్ గ‌ణాంకాలు చాలా పేల‌వంగా ఉన్నాయి. అజ‌య్ జడేజా మార్గ‌నిర్దేశంలో ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆ గ‌ణాంకాల‌ను మార్చాల‌ని అఫ్గాన్ భావిస్తోంది.

2015 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ నుంచి అఫ్గాన్ జ‌ట్టు మెగాటోర్నీల్లో పాల్గొంటుంది. 2015 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఒక్క విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఆ త‌రువాత ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో మ‌రో విజ‌యాన్ని సాధించ‌లేదు. 2019 ప్ర‌పంచ‌క‌ప్‌లో ఒక్క గేమ్‌ను గెల‌వ‌లేక‌పోయింది. దీంతో ఈ సారి భార‌త్ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న చేయాల‌ని హష్మతుల్లా షాహిదీ సారథ్యంలోని అఫ్గాన్ జ‌ట్టు భావిస్తోంది. అందుకనే భార‌త పిచ్‌ల‌పై మంచి అవ‌గాహాన ఉన్న అజ‌య్ జ‌డేజాను మెంట‌ర్‌గా నియ‌మించుకుంది.

టెస్టుల్లో విఫ‌లమైనా.. వ‌న్డేల్లో రాణించాడు..

అజయ్ జడేజా 1992 నుంచి 2000 వరకు టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వ‌హించాడు. భార‌త జ‌ట్టు త‌రుపున 15 టెస్టులు, 196 వ‌న్డే మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 26.18 స‌గ‌టుతో 576 ప‌రుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. వ‌న్డేల్లో 37.47 స‌గ‌టుతో 5,359 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 30 అర్థ‌శ‌త‌కాలు ఉన్నాయి. జ‌డేజా 111 ఫస్ట్ క్లాస్, 291 లిస్ట్ ఏ గేమ్‌లను ఆడాడు. ఈ రెండు ఫార్మాట్‌లలో కలిపి 31 సెంచరీలు, 88 అర్ధసెంచరీలతో ప్రతి ఫార్మాట్‌లో 8000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.

Asian Games : తెలంగాణ అథ్లెట్ పై స్వప్న బర్మన్‌ సంచ‌ల‌న ఆరోపణ‌.. ట్రాన్స్‌జెండ‌ర్ అంటూ.. కౌంట‌ర్ ఇచ్చిన నందిని

ఇదిలా ఉంటే.. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 లో అఫ్గానిస్థాన్ జ‌ట్టు త‌న మొద‌టి మ్యాచ్ అక్టోబ‌ర్ 7న ధ‌ర్మ‌శాల వేదిక‌గా బంగ్లాదేశ్‌తో త‌ల‌ప‌డ‌నుంది. ఇక భార‌త జ‌ట్టుతో 11 అక్టోబ‌ర్ న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదిక‌గా పోటీప‌డ‌నుంది.

ప్ర‌పంచ‌క‌ప్‌కు అఫ్గానిస్థాన్‌ జట్టు ఇదే : హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్‌), రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రియాజ్ హసన్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, ఇక్రమ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్, రహ్మద్ రహ్మద్, ఎఫ్, నవీన్ ఉల్ హక్.