Impact of Social Media on Students : సోషల్ మీడియా విద్యార్ధుల మానసిక పరిస్థితిని దెబ్బ తీస్తోందట.. వాస్తవలు వెల్లడించిన సర్వే

పసిపిల్లల నుంచి వృద్ధుల వరకు చేతిలో సెల్ ఫోన్.. సోషల్ మీడియానే ప్రపంచం.. చదువుకునే పిల్లలు ఎక్కువగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయితే ఎదురయ్యే దుష్ప్రభావాలను తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. అవేంటో చదవండి.

Impact of Social Media on Students : సోషల్ మీడియా విద్యార్ధుల మానసిక పరిస్థితిని దెబ్బ తీస్తోందట.. వాస్తవలు వెల్లడించిన సర్వే

Impact of Social Media on Students

Impact of Social Media on Students : వయసుతో సంబంధం లేకుండా ఎవరి చేతిలో చూసినా సెల్ ఫోన్.. నలుగురు ఒక చోట కూర్చున్నా ఎవరి ఫోన్లో వారు సోషల్ మీడియాలో బిజీ బిజీ.. సోషల్ మీడియా కలిగించే హాని సంగతి అలా ఉంచితే.. సోషల్ మీడియా వ్యవసనం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా విద్యార్ధుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నాయి.

UK pour Moi :  భారతీయ మహిళలే ప్రపంచంలో అత్యంత అందమైనవారట .. అధ్యయనంలో వెల్లడి

తెల్లారి లేస్తే సోషల్ మీడియాలోనే ఉండే స్టూడెంట్స్ మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోందట. డిప్రెషన్‌తో బాధపడుతూ తమ మీద తాము నమ్మకాన్ని కోల్పోతున్నారని తెలుస్తోంది. చైనా, తైవాన్, మలేషియాకు చెందిన 622 మంది యూనివర్సిటీ విద్యార్ధుల ఆన్ లైన్ సర్వేలో స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించేవారి మానసిక ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని కనుగొన్నారు.

మలేషియా విశ్వవిద్యాలయానికి చెందిన 380 మంది విద్యార్ధులపై జరిపిన మరో అధ్యయనంలో సోషల్ మీడియా ఎక్కువగా ఉపయోగించే విద్యార్ధులు డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడిని ఎదుర్కుంటున్నారని తేలిందట. ముఖ్యంగా యువత సోషల్ మీడియాను వాడుతూ ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నారని కనిపెట్టారు. సోషల్ మీడియా వాడటం చెడ్డ అంశం కాదు. దీని వినియోగం వల్ల కొన్ని మంచి విషయాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. ప్రజలు కొన్ని సోషల్ నెట్ వర్క్‌లను పెంచుకోవడానికి, ఒంటరితనాన్ని అధిగమించడానికి సోషల్ మీడియా ఉపయోగిస్తారు. అలా మానసిక ఆరోగ్య ప్రయోజనాలను కూడా సూచిస్తోంది.

Four-Day Work Week: వారానికి నాలుగు రోజులే పని.. షార్జాలో సత్ఫలితాన్నిచ్చిందా? అధ్యయనంలో ఏం తేలిందంటే

కానీ.. సోషల్ మీడియాని ఎక్కువగా వాడటం వల్ల సమస్యలు వస్తాయని.. ముఖ్యంగా చదువుకునే విద్యార్ధుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రమాదాన్ని చూపుతుందని మాత్రం నిపుణులు హెచ్చరిస్తున్నారు.