Indian Students : ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తుతున్నాయి. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

Indian Students : ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంలో చిక్కుకున్న భారతీయ విద్యార్థులు

Israel-Palestine war

Israel-Palestine war Indian Students : ఇజ్రాయిెల్ – పాలస్తీనా మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య మరో ఘర్షణ నెలకొంది. గాజా స్ట్రిప్ ఇజ్రాయెల్ పై 5000 రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ ప్రకటించింది. హమాస్ దాడి కారణంగా ఇప్పటివరకు 40 మంది మృతి చెందారు. రాకెట్లు, కాల్పులు, సైరన్ల శబ్దాలతో ఇజ్రాయెల్ నగరాలు హోరెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంలో భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారు.

భారత విద్యార్థులు భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. విద్యార్థులతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నారు. కొందరు విద్యార్థులను సమీపంలోని షెల్టర్లకు తరలించారు. గాజా స్ట్రిప్ సమీపంలోని ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.

Israel Palestina Crisis: ఏంటీ ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం? చిన్న స్థలం కోసం ఎందుకు మూడు మతాలు అంతలా కొట్టుకుంటున్నాయి?

గాజాస్ట్రిప్ పై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించింది. పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగడం ఇది మొదటిసారి కాదు. 2021లో కూడా వీరిద్దరి మధ్య యుద్ధం జరిగింది. వాస్తవానికి ఇది ఇజ్రాయెల్ – పాలస్తీనా ఘర్షణతో ప్రారంభం అయింది.హమాస్ తీవ్రవాద సంస్థ దాడి అనంతరం ఇజ్రాయెల్ లో సుమారు 40 మంది మృతి చెందినట్లు, మరో 500 మందికిపైగా గాయపడినట్లు అక్కడి స్థానిక మీడియా పేర్కొంది.

శనివారం తెల్లవారుజామునే ఇజ్రాయెల్ వైపు గాజా కేంద్రంగా ఉన్న హమాస్ ఉగ్రవాద సంస్థ 5 వేల రాకెట్లు ప్రయోగించినట్లు స్వయంగా వారే పేర్కొన్నారు. ఈ దాడులు కాకుండా ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి ఇష్టమొచ్చినట్టుగా కాల్పులు జరిపారు.

Israel Palestina Crisis: యుద్ధం మొదలైంది, అంతకంతకూ పగ తీర్చుకుంటాం.. హమాస్ దాడి అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన

కొంతమంది ఇజ్రాయెలీలను కిడ్నాప్ చేశారు. హమాస్ అనేది పాలస్తీనాకు చెందిన గాజాలో అధికారం చెలాయిస్తున్న తిరుగుబాటు సంస్థ. ఈ దాడి అనంరతం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు తీవ్ర స్థాయిలో స్పందించారు. యుద్ధం వాళ్లు ప్రారంభించారని, దానికి వాళ్లు భారీ మూల్యం చెల్లించుకుంటారని పేర్కొన్నారు.