Operation Ajay : ఆపరేషన్ అజయ్ ప్రారంభం…ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన మొదటి విమానం

ఇజ్రాయెల్‌ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది....

Operation Ajay : ఆపరేషన్ అజయ్ ప్రారంభం…ఇజ్రాయెల్ నుంచి బయలుదేరిన మొదటి విమానం

Operation Ajay First Flight

Operation Ajay : ఇజ్రాయెల్‌ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి మొదటి చార్టర్ విమానం గురువారం రాత్రి బెన్ గురియన్ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. 230 మంది భారతీయులు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా విమానంలో వచ్చారు. అక్టోబరు 7వతేదీన యుద్ధం ప్రారంభమైన రోజున ఎయిర్ ఇండియా తన విమానాన్ని నిలిపివేసింది. తిరిగి భారతదేశానికి వచ్చిన వారి విమాన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తోంది.

Also Read :బీర్ లవర్స్‌కు వెరీ బ్యాడ్ న్యూస్

టెల్ అవీవ్ నుంచి ఆపరేషన్ అజయ్ కింద ప్రత్యేక విమానంలో ఎక్కడానికి విమానాశ్రయంలో విద్యార్థులతో సహా భారతీయులు బారులు తీరారు. యుద్ధం వల్ల తాము తీవ్ర భయాందోళనలకు గురయ్యామని, భారత రాయబార కార్యాలయం ప్రకటన తమకు ఉపశమనం కలిగించిందని ఇజ్రాయెల్‌లోని శుభం కుమార్ అనే విద్యార్థి చెప్పారు. హమాస్ దాడిలో ఇజ్రాయెల్‌లో 222 మంది సైనికులతో సహా 1,300 మంది కంటే ఎక్కువ మంది మరణించారని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది.

Also Read :Israeli Palestinian conflict: గాజా స్ట్రిప్ అంటే ఏమిటి? ఎందుకు అది ప్రపంచంలోనే అతిపెద్ద బహిరంగ చెరసాలగా మారింది?

భారత రాయబార కార్యాలయం ప్రత్యేక విమానం కోసం నమోదు చేసుకున్న భారతీయ పౌరులకు ఈమెయిల్ పంపింది. తదుపరి విమానాల కోసం నమోదు చేసుకున్న వ్యక్తులకు సందేశాలను ఎక్స్ లోనూ పంపిస్తామని ఇజ్రాయెల్ దేశంలోని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.