Sreeleela : శ్రీలీల – అనిల్ రావిపూడి చుట్టాలంట.. శ్రీలీల అనిల్‌ని ఏమని పిలుస్తుందో తెలుసా?

తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల కలిసి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ రిలేటివ్స్ అవుతారు అని కూడా చెప్పారు.

Sreeleela : శ్రీలీల – అనిల్ రావిపూడి చుట్టాలంట.. శ్రీలీల అనిల్‌ని ఏమని పిలుస్తుందో తెలుసా?

Anil Ravipudi and Sreeleela said they both are Relatives

Sreeleela : టాలీవుడ్(Tollywood) లో ఇప్పుడు బాగా వినపడుతున్న పేరు శ్రీలీల. చేతిలో దాదాపు డజను సినిమాలు పెట్టుకొని వరుసగా షూటింగ్స్, రిలీజ్ లతో బిజీగా ఉంది. తన డ్యాన్స్, నటనతో ప్రేక్షకులని మెప్పిస్తూ అందరికి ఫేవరేట్ అయిపోయింది శ్రీలీల. శ్రీలీల దసరాకి బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమాతో రాబోతుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ(Balakrishna) హీరోగా, బాలయ్యకు కూతురి పాత్రలో శ్రీలీల చేస్తున్న భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.

దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం వరుస ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీలీల కలిసి ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా ఇందులో పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరూ రిలేటివ్స్ అవుతారు అని కూడా చెప్పారు. అనిల్ రావిపూడి, శ్రీలీల వాళ్ళ అమ్మ స్వర్ణ.. ఇద్దరిది ఒకటే ఊరు అంట. ఒంగోలు దగ్గర పొంగులూరు అనే ఊరు. ఇది శ్రీలీల వాళ్ళ అమ్మమ్మ ఊరు. శ్రీలీల బెంగుళూరు, అమెరికాలో పెరిగినా అప్పుడప్పుడు హాలిడేస్ కి అమ్మమ్మ ఊరికి వచ్చేదట. శ్రీలీల వాళ్ళ అమ్మ అనిల్ రావిపూడికి అక్క వరుస అవుతుందట. దీంతో వీరిద్దరూ మామ కోడలు వరుస అవుతారట. అయితే ఈ విషయం భగవంత్ కేసరి షూటింగ్ టైంలోనే తెలిసిందని అనిల్ రావిపూడి తెలిపాడు.

Also Read : Bigg Boss Sivaji : హౌస్‌లో శివాజీకి గాయం..? బయటకి పంపించేసిన బిగ్‌బాస్..

భగవంత్ కేసరి షూట్ టైంలో.. ఇద్దరూ మాట్లాడుకుంటూ సొంతూళ్ల గురించి టాపిక్ రావడంతో ఈ విషయం బయట పడింది. అయితే శ్రీలీల వాళ్ళ అమ్మమ్మ అనిల్ రావిపూడి వాళ్ళకి చుట్టాలవుతారని, శ్రీలీల వాళ్ళ అమ్మ ఎప్పుడో అమెరికా వెళ్లిపోవడంతో, కాంటాక్ట్ లేకపోవడంతో ఇన్నాళ్లు తెలియలేదని, ఇప్పుడు తెలిసిన తర్వాత హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు తెలిపాడు అనిల్. ఇక శ్రీలీల కూడా ఈ విషయం తెలిసి మొదట ఆశ్చర్యపోయి ఆ తర్వాత ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందట. ఇక వీరిద్దరూ రిలేటివ్స్ అని తెలిసిన తర్వాత అనిల్ రావిపూడిని సెట్ లో మాత్రం డైరెక్టర్ గారు అని పిలిచి బయట మాత్రం మామ అని పిలుస్తున్నాను అని తెలిపింది శ్రీలీల.