Netflix Plan Prices : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ప్రీమియం ప్లాన్ల ధరలు.. ఏడాదిలో ముచ్చటగా మూడోసారి!

Netflix Plan Prices : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు మళ్లీ షాకిచ్చింది. 2023 ఏడాదిలో మూడోసారి ప్రైమరీ, ప్రీమియం ప్లాన్‌ల ధరలను భారీగా పెంచుతోంది. ఈ ధరల పెంపుతో కంటెంట్ లైబ్రరీని పెంచాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

Netflix Plan Prices : నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాక్.. భారీగా పెరిగిన ప్రీమియం ప్లాన్ల ధరలు.. ఏడాదిలో ముచ్చటగా మూడోసారి!

Netflix increases subscription plan prices again, details here

Netflix Plan Prices : ప్రముఖ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) మరోసారి ప్లాన్ ధరలను భారీగా పెంచేసింది. మూడో త్రైమాసిక ఆదాయాల నివేదికను షేర్ చేస్తూ.. స్ట్రీమింగ్ దిగ్గజం ప్రైమరీ ప్లాన్ (Netflix Primary Plans) ధరను నెలకు 9.99 డాలర్ల నుంచి 11.99 డాలర్లకి పెంచేసింది. ప్రీమియం ప్లాన్ ధరను (Netflix Plan Prices) నెలకు 19.99 డాలర్ల నుంచి 22.99 డాలర్లకి పెంచుతున్నట్లు ప్రకటించింది. నెట్‌ఫ్లిక్స్ 6.99 డాలర్లు యాడ్-సపోర్టెడ్ ప్లాన్, 15.49 డాలర్ల స్టాండర్డ్ టైర్ ధర ఇన్‌స్టంట్ ప్రభావంతో ఉంటుంది.

నెట్‌ఫ్లిక్స్ లేటెస్ట్ ధరల పెంపు యూఎస్, యూకే, ఫ్రాన్స్ మార్కెట్‌లను ప్రభావితం చేస్తుంది. యూకేలో ఫ్రాన్స్‌లలో బేసిక్, ప్రీమియం ప్లాన్‌ల ధరలు కూడా పెరుగుతున్నాయి. అయితే, యాడ్-సపోర్టెడ్, స్టాండర్డ్ ప్లాన్‌లు మారవు. యూకేలో బేసిక్, ప్రీమియం ప్లాన్‌ల ధర వరుసగా డాలర్ల 7.99 నుంచి 17.99 డాలర్లు ఉంటుంది. అయితే, ఫ్రాన్స్‌లోని కస్టమర్‌లు బేసిక్ ప్లాన్ 10.99 డాలర్ల వరకు మారవచ్చు. నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం ప్లాన్ ధర 19.99 డాలర్ల వరకు పెంచుతుంది.

ధరల పెంపు ఎందుకంటే? :

నెట్‌ఫ్లిక్స్ ధరల పెరుగుదల కంటెంట్ లైబ్రరీని పెంచుకోవడానికి, బెస్ట్ క్రియేటర్లతో పార్టనర్‌గా ఉండటానికి, టీవీ షోలు, మూవీలు, గేమ్‌లలో మరింత పెట్టుబడి, మరింత విలువైన వ్యాపారాన్ని నిర్మించడంలో సాహయపడుతుందని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా, నెట్‌ఫ్లిక్స్ చివరిగా జనవరి 2022లో ధరలను పెంచింది.

Read Also : Free Netflix Subscription : రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్లాన్లతో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

జూలైలో కొత్తగా తిరిగి వచ్చే యూజర్లకు 9.99 డాలర్లు బేసిక్ యాడ్-ఫ్రీ ప్లాన్‌ను అందించడం ఆపివేసింది. వినియోగదారులు తమ ప్లాన్లలో యాడ్స్ నివారించేందుకు ఎక్కువ పేమెంట్ చెల్లించవలసి వచ్చింది. అమెరికాలో నెలకు 6.99 డాలర్లు పెంచేసింది. ఉదాహరణకు, ఇది సగటు ధర కంటే చాలా తక్కువ. ఒక సినిమా టికెట్ అని నెట్‌ఫ్లిక్స్ వాటాదారులకు లేఖలో పేర్కొంది.

Netflix increases subscription plan prices again, details here

Netflix subscription plans

పెయిడ్ షేరింగ్ ప్రొగ్రామ్ :

ఇంతలో, నెట్‌ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేస్తోంది. ప్రతి ఇంటికి సొంత ప్లాన్ అవసరమని చెబుతోంది. సంస్థ ఇటీవలి నివేదికల్లో ఈ పాస్‌వర్డ్ షేరింగ్ అనేది సబ్‌స్ర్కైబర్ల సంఖ్యను పెంచడానికి సాయపడుతుందని చూపుతున్నాయి. పాస్‌వర్డ్ షేరింగ్ నిషేధించిన నెట్‌ఫ్లిక్స్ ‘పెయిడ్ షేరింగ్’ ప్రోగ్రామ్‌ను అధికారికంగా నిర్వహించే ప్రతి ప్రాంతంలో కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

నెట్‌ఫ్లిక్స్ పేమెంట్ పార్టనర్ ప్రోగ్రామ్ నెలకు అదనపు రుసుముతో వారి అకౌంటుకు ఇద్దరు అదనపు సభ్యులను అనుమతిస్తుంది. ప్రత్యేక సభ్యత్వం కోసం చెల్లించడం కన్నా మరింత సరసమైన ఆప్షన్ అందిస్తుంది. యూజర్లు తమ ఇంటి వెలుపల నివసించే వ్యక్తులతో తమ అకౌంట్ షేర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.

డిస్నీ, ప్రైమ్ వీడియోకు పోటీగా :
పాస్‌వర్డ్-షేరింగ్ నిలిపివేయడం కారణంగా ఊహించిన దానికంటే తక్కువ మంది కస్టమర్‌లు తమ సభ్యత్వాలను రద్దు చేసుకున్నారని నెట్‌ఫ్లిక్స్ నివేదించింది. వాస్తవానికి, గతంలో ఇతరుల నుంచి పాస్‌వర్డ్‌లను తీసుకున్న చాలా మంది కస్టమర్‌లు ఫుల్ పేమెంట్ చందాదారులుగా మారుతున్నారు. డిస్నీ+ (Disney Plus), HBO Max, అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) వంటి ఇతర స్ట్రీమింగ్ సర్వీసుల నుంచి పెరుగుతున్న పోటీని ఎదుర్కొంటోంది.

Read Also : Jio Netflix Plan Offer : జియో నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ ఆఫర్.. రోజుకు 3GB డేటా, ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్ర్కిప్షన్ పొందవచ్చు.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!