MLA Eluri Sambasivarao : టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయి

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ, ఓట్ల అక్రమాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు ఆరోపించారు.

MLA Eluri Sambasivarao : టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయి

MLA Eluri Sambasivarao

Parchur MLA Eluri Sambasivarao : టీడీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్రలు జరుగుతున్నాయని, ప్రతీ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతి పరులవి 25వేల ఓట్లు తొలగించేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. చంద్రబాబు అరెస్టయిన వారంరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2.45లక్షల ఓట్ల తొలగింపునకు ఫామ్-7 లు అప్లోడ్ చేశారని, అదే సమయంలో కొత్త ఓట్లు చేరికలకు దాదాపు 1.20 లక్షలు ఫామ్-6లు పెట్టారని సాంబశివరావు అన్నారు. తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తీసేసి వైసీపీ అనుకూల వ్యక్తులకు నాలుగైదు చోట్ల ఓటు హక్కు కల్పించేలా ఫామ్-6లు పెట్టారని, దీని వెనుక ఉన్న ఫేక్ సిమ్ కార్డ్ రాకెట్ పై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించబడాలని పేర్కొన్నారు.

Also Read : Nara Bhuvaneshwari: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి.. రేపటి నుంచి బస్సుయాత్ర

వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ, ఓట్ల అక్రమాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే సాంబశివరావు అన్నారు. కొంతమంది ఎన్నికల అధికారులు వైసీపీ అక్రమాలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల అక్రమాలకు పాల్పడిన వారిపై తూతూ మంత్రంగా కంటి తుడుపు చర్యలు తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు మొట్టికాయలు వేస్తోంది కాబట్టి పర్చూరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని కూనీచేసిన వారిని వీఆర్ లో పెట్టి సరిపెట్టారని అన్నారు.

Also Read : Puvvada And Ponguleti : పువ్వాడ, పొంగులేటిపై ఘాటైన వ్యాఖ్యలతో మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల

ఓట్ల అక్రమాల కుట్రలో 189 మంది భాగస్వాములు అయితే కేవలం 12 మందిపై కంటి తుడుపు చర్యలు తీసుకున్నారని ఎమ్మెల్యే సాంబశివరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి పెనుముప్పు వాటిల్లుతుంటే, ఆ కుట్రలో భాగస్వాములైన అధికారుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని, ఎన్నికల సంఘం పెట్టిన కఠిన నిబంధనలు అన్నీ వీరికి వర్తింపచేయిస్తాం.. తప్పు చేసిన అధికారులను సస్పెండ్ చేసి, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేవరకూ విడిచిపెట్టం అని పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు హెచ్చరించారు.