Congress Second List : గద్దర్ కూతురికి టికెట్.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్, ఏ సామాజికవర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారంటే

ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి.. Telangana Congress Second List

Congress Second List : గద్దర్ కూతురికి టికెట్.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్, ఏ సామాజికవర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారంటే

Telangana Congress Second List Community Wise

Telangana Congress Second List : తెలంగాణ కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్ అయ్యింది. 45 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో జాబితాను ప్రకటించింది. హుజురాబాద్ నుంచి వడితల ప్రణవ్, సిద్ధిపేట నుంచి పూజల హరికృష్ణ, మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుస్నాబాద్ నుంచి పొన్నం ప్రభాకర్, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పరకాల నుంచి రేవూరి ప్రకాశ్ రెడ్డి, ఖైరతాబాద్ నుంచి పి.విజయారెడ్డి, చొప్పదండి నుంచి మేడిపల్లి సత్యం, ఎల్బీ నగర్ నుంచి మధుయాష్కీ, జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్ బరిలోకి దిగుతున్నారు. కాగా, మరో 19 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేర్లను పెండింగ్ లో ఉంచింది కాంగ్రెస్ హైకమాండ్.

ఇక సామాజికవర్గాల వారీగా చూసుకుంటే..

* రెడ్డి – 21

* కమ్మ – 3

* బీసీ-9

* ముదిరాజ్ – 3

* వెలమ – 2

* ఎస్టీ లంబాడా – 3

* పద్మశాలి – 1

* ముస్లిం మైనారిటీ – 1

* ఎంబీసీ- 1

* బ్రాహ్మిణ్- 1

* గౌడ్- 3

* గోండు- 2

* కోయ – 1

Also Read : జూబ్లీహిల్స్ నుంచి అజారుద్దీన్, ఎల్బీనగర్ నుంచి మధుయాష్కీ గౌడ్.. 45మందితో తెలంగాణ కాంగ్రెస్ రెండో జాబితా విడుదల

ఇప్పటివరకు మొత్తం 100 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది..

* రెడ్డి సామాజిక వర్గానికి మొత్తం 37 స్థానాలు.

* బీసీలకు 20 స్థానాలు.

* వెలమలకు 8 స్థానాలు.

* కమ్మలకు 3 స్థానాలు.

* బ్రాహ్మణులకు 2 స్థానాలు.

* మైనారిటీలకు 4 స్థానాలు

* ఎస్టీ స్థానాలు 19, ఎస్టీ స్థానాలు 12.

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ – జిల్లాల వారీగా

1. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా :
ఆదిలాబాద్ : కంది శ్రీనివాసరెడ్డి
బోథ్ : బాపూరావ్ రాథోడ్
ముధోల్ : భోస్లే నారాయణ రావ్ పటేల్
సిర్పూర్ : రావి శ్రీనివాస్
ఆసిఫాబాద్ : అజ్మీరా శ్యామ్
ఖానాపూర్ : ఎడ్మ బొజ్జు

2. నిజామాబాద్ జిల్లా :
నిజామాబాద్ (రూరల్) : రేకులపల్లి భూపతిరెడ్డి
ఎల్లారెడ్డి : మదన్‌మోహన్‌రావ్

3. కరీంనగర్ జిల్లా :
చొప్పదండి : మేడిపల్లి సత్యం
హుజురాబాద్ : వడితెల ప్రణవ్
కోరుట్ల : జువ్వాడి నర్సింగరావ్
హుస్నాబాద్ : పొన్నం ప్రభాకర్

4. వరంగల్ జిల్లా :
జనగాం : కొమ్మూరి ప్రతాప్ రెడ్డి
పరకాల : రేవూరి ప్రకాశ్ రెడ్డి
వరంగల్ వెస్ట్ : నాయిని రాజేందర్ రెడ్డి
వరంగల్ ఈస్ట్ : కొండా సురేఖ
వర్థన్నపేట : కేఆర్ నాగరాజు
పాలకుర్తి : ఎం యశస్విని
మహబూబాబాద్ : డాక్టర్ మురళీ నాయక్

5. మెదక్ జిల్లా :
నర్సాపూర్ : ఆవుల రాజిరెడ్డి
సిద్దిపేట : పూజల హరికృష్ణ
దుబ్బాక : చెరుకు శ్రీనివాసరెడ్డి

6. రంగారెడ్డి జిల్లా :
తాండూర్ : బుయ్యని మనోహర్ రెడ్డి
ఇబ్రహీంపట్నం : మల్‌రెడ్డి రంగారెడ్డి
ఎల్బీనగర్ : మధుయాష్కీ
మహేశ్వరం : కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి
రాజేంద్రనగర్ : కస్తూరి నరేందర్
శేరిలింగంపల్లి : జగదీశ్వర్ గౌడ్
కూకట్‌పల్లి : బండి రమేశ్

7. హైదరాబాద్ జిల్లా :
అంబర్‌పేట్ : రోహిన్ రెడ్డి
ఖైరతాబాద్ : పి.విజయారెడ్డి
జూబ్లీహిల్స్ : అజారుద్దీన్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ : డాక్టర్ గుమ్మడి వెన్నెల

Also Read : గద్దర్ కూతురికి టికెట్.. కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ రిలీజ్, ఏ సామాజికవర్గానికి ఎన్ని సీట్లు ఇచ్చారంటే

8. మహబూబ్‌నగర్ జిల్లా :
నారాయణ్ పేట్ : డాక్టర్ పర్ణిక చిట్టెంరెడ్డి
మహబూబ్‌నగర్ : ఎన్నం శ్రీనివాసరెడ్డి
జడ్చర్ల : అనిరుధ్ రెడ్డి
దేవరకద్ర : జి మధుసూధన్ రెడ్డి
మక్తల్ : వాకిటి శ్రీహరి
వనపర్తి : జి. చిన్నారెడ్డి

9. నల్లగొండ జిల్లా :
దేవరకొండ : బాలూ నాయక్
మునుగోడు : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి : కుంభం అనిల్ కుమార్ రెడ్డి

10. ఖమ్మం జిల్లా :
పినపాక : పాయం వెంకటేశ్వర్లు
ఖమ్మం : తుమ్మల నాగేశ్వరరావు
పాలేరు : పొంగులేటి శ్రీనివాసరెడ్డి