CPM : పొత్తుపై క్లారిటీ ఇవ్వాలి లేకుంటే మా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాం.. కాంగ్రెస్ కు మరోసారి సీపీఎం డెడ్ లైన్

కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరి పోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు.

CPM : పొత్తుపై క్లారిటీ ఇవ్వాలి లేకుంటే మా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాం.. కాంగ్రెస్ కు మరోసారి సీపీఎం డెడ్ లైన్

CPM Deadline Congress

CPM Deadline Congress : కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తుపై సందిగ్థత కొనసాగుతోంది. ఇరు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఓ కొలిక్కి రావడం లేదు. సీపీఎంతో కాంగ్రెస్ పొత్తు తేలడం లేదు. దీంతో సీపీఎం మరోసారి హస్తం పార్టీకి డెడ్ లైన్ విధించింది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు పొత్తుపై క్లారిటీ ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. లేకుంటే తమ తమ దారి చూసుకుంటామని ప్రకటించింది. వాస్తవానికి నిన్నటి వరకే కాంగ్రెస్ కు సీపీఎం డెడ్ లైన్ విధించింది.

అయితే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫోన్ చేసి మాట్లాడారు. దీంతో ఇవాళ్టి మధ్యాహ్నం వరకు పొత్తు సంగతి తేల్చాలని తమ్మినేని వీరభద్రం కోరారు. మధ్యాహ్నం 3 గంటల లోపు పొత్తులపై క్లారిటీ ఇవ్వకుంటే వెంటనే మీడియా సమావేశం నిర్వహించి తమ పార్టీ అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామని తెలిపారు. ఏ ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నామో చెబుతామన్నారు.

CPI – CPM : కాంగ్రెస్ తో వామపక్షాల పొత్తుపై కొనసాగుతున్న సందిగ్థత

ఇవాళ ఉదయం సీపీఐతో సీపీఎం నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ వైరా, మిర్యాలగూడ స్థానాలను తమకు కేటాయించకపోతే తాము ముందుకు వెళ్లబోతున్నట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందో లేదో ఇవాళ తేలుతుందన్నారు. తాము అడిగిన సీట్లు ఇస్తారో లేదో కాంగ్రెస్ చెప్పాలని డిమాండ్ చేశారు.

పొత్తు లేకుంటే తాము పోటీ చేసే సీట్లేమిటో ప్రకటిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ అంచనాలు, సీపీఐ నిర్ణయాలపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొన్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరి పోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు.