Surat : సూరత్ రైల్వే స్టేషనులో తొక్కిసలాట, ఒకరి మృతి, పలువురికి గాయాలు

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీపావళి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున జనం సూరత్ రైల్వేస్టేషనుకు రావడంతో తొక్కిసలాట జరిగింది....

Surat : సూరత్ రైల్వే స్టేషనులో తొక్కిసలాట, ఒకరి మృతి, పలువురికి గాయాలు

Surat railway station

Surat : గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ రైల్వేస్టేషనులో ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగింది. దీపావళి పండుగ కోసం స్వగ్రామాలకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున జనం సూరత్ రైల్వేస్టేషనుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరు మరణించగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రైలు ఎక్కుతుండగా తొక్కిసలాట జరిగి ఒకరు మృతి చెందగా, మరికొందరు స్పృహతప్పి పడిపోయి గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి తక్షణ వైద్య సహాయం అందించారు.

ALSO READ : ICC World Cup : వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ బెర్తులు ఖరారు.. అర్హత సాధించిన ఆ నాలుగు జట్లు

సూరత్ ఎంపీ, రాష్ట్ర రైల్వే మంత్రి దర్శన జర్దోష్ క్షతగాత్రులను పరామర్శించేందుకు ఆసుపత్రిని సందర్శించారు. తీవ్రంగా గాయపడిన సరోజిని కుమారి అనే ప్రయాణికురాలికి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం పశ్చిమ రైల్వే ముంబై, గుజరాత్,మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ 400 ట్రిప్పులతో 46 జతల ప్రత్యేక రైళ్లను నడిపింది.

ALSO READ : వాట్సాప్‌లోనే ఆధార్, పాన్ డౌన్‌లోడ్ చేయొచ్చు!

7 లక్షల మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు ప్రయాణిస్తున్నారని రైల్వే చీఫ్ పీఆర్ఓ సుమిత్ ఠాకూర్ చెప్పారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని క్రౌడ్ మేనేజ్‌మెంట్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆయన పేర్కొన్నారు. సూరత్ స్టేషన్‌లో దాదాపు 165 మంది ఆర్‌పిఎఫ్, జిఆర్‌పి జవాన్‌లను మోహరించారు. ప్రయాణికులకు టికెట్ల జారీకి అదనపు కౌంటర్లు తెరిచామని ఆయన తెలిపారు.