Battlefield : తెలంగాణలో రాజకీయ సంచలనాలకు కేంద్రంగా మారిన ”ఆ నలుగురు”

Telangana Assembly Elections 2023 : ఎవరి సహకారం లేకుండా రాష్ట్ర రాజకీయాలను ఆకర్షిస్తున్న ఓ నలుగురు మాత్రం ఎన్నికలకే హైలైట్ గా నిలుస్తున్నారు. ఆ నలుగురిలో ఒకరు మాజీ ఐపీఎస్, ఇంకొకరు మాజీ సీఎం తనయుడు, మరో ఇద్దరు సామాన్యులు.

Battlefield : తెలంగాణలో రాజకీయ సంచలనాలకు కేంద్రంగా మారిన ”ఆ నలుగురు”

Four Special Persons In Telangana Assembly Elections 2023

119 నియోజకవర్గాలు. 3 ప్రధాన పార్టీలు. ఆ పార్టీలకు మద్దతు పలుకుతున్న మరికొన్ని పార్టీలు. పోలింగ్ కు సమయం సమీపిస్తోంది. ప్రచారం హోరెత్తింది. ఓవైపు ప్రధాని మోదీ దగ్గరి నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్.. మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గు, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్.. ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంతోమంది లీడర్లు క్షణం తీరిక లేకుండా తెలంగాణలోని గల్లీ గల్లీలో తిరుగుతున్నారు.

విమర్శలు, ప్రతివిమర్శలు.. ప్రగతి నివేదికలు, నిట్టూర్పులు, ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో ఎత్తులు, మరెన్నో వ్యూహాలతో క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఎవరి సహకారం లేకుండా రాష్ట్ర రాజకీయాలను ఆకర్షిస్తున్న ఓ నలుగురు మాత్రం ఎన్నికలకే హైలైట్ గా నిలుస్తున్నారు. ఆ నలుగురిలో ఒకరు మాజీ ఐపీఎస్, ఇంకొకరు మాజీ సీఎం తనయుడు, మరో ఇద్దరు సామాన్యులు. ఆ ఇద్దరిలో ఒకరు సాధారణ సర్పంచ్, మరొకరు బర్రెలక్క అలియాస్ శిరీష.

Also Read : మెదక్‌లో హైఓల్టేజ్ పాలిటిక్స్.. బరిలో బడా లీడర్లు, గెలుపెవరిది?

ప్రతి నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల నాయకులతో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేస్తున్నా ఈ నలుగురు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఈ నలుగురి నేపథ్యం పూర్తిగా డిఫరెంట్. ఇద్దరు రాజకీయాలకు పూర్తిగా కొత్త, మరో ఇద్దరు రాజకీయాల్లో నమ్మిన వారి చేతిలో మోసపోయారు. మొత్తానికి ఆ నలుగురి స్వభావం తిరుగుబాటే.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తొలిసారి ఎన్నికల గోదాలోకి దిగారు. అయినప్పటికీ ఓ పార్టీకి రాష్ట్ర అధినేతగా బాధ్యతలు తీసుకుని బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా తన స్వరం వినిపిస్తున్నారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జలగం కుమారుడు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్ కొత్తగూడెం ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా అధికార పార్టీపై తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఇక పటాన్ చెరు నియోజకవర్గంలో ఓ గ్రామ పంచాయితీ సర్పంచ్ గా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నీలం మధు ఎమ్మెల్యే కావాలన్న ఆకాంక్షతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల చేతిలో దెబ్బతిని ఆ రెండు పార్టీలను ధిక్కరించి ఏనుగు గుర్తుతో బరిలోకి దిగిపోయారు.

ఇక బర్రెలక్క విషయానికి వస్తే ఎన్నికల్లో హడావుడి అంతా బర్రెలక్క అలియాస్ శిరీషదే. సోషల్ మీడియాను షేక్ చేస్తూ కొల్లాపూర్ లో ప్రధాన పార్టీలకు నిద్ర లేకుండా చేస్తోంది బర్రెలక్క. హాయ్ ఫ్రెండ్స్ డిగ్రీలు చేస్తే మెమోలు వస్తాయి తప్ప ఉద్యోగం రాదు అందుకే బర్రెలు కాస్తున్నా అంటూ రెండేళ్ల క్రితం శిరీష పెట్టిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఆ తర్వాత ఆమె పేరే బర్రెలక్కగా మారిపోయింది.

Also Read : మహబూబ్‌నగర్ జిల్లాలో రసవత్తర రాజకీయం.. ఏ పార్టీ గ్రాఫ్ ఎలా ఉంది?

ఇప్పుడామె కొల్లాపూర్ నుంచి విజిల్ గుర్తుతో పోటీ చేస్తూ ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతోంది. ఏకంగా ఆమె తరపున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ఉస్మానియా విద్యార్థులు కూడా జోరుగా ప్రచారం చేస్తూ ప్రధాన పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఇలా తెలంగాణ రాజకీయాన్ని సొంత ఇమేజ్ తో తమ చుట్టూ తిప్పుకుంటున్న ఆ నలుగురు అభ్యర్థుల గురించి స్పెషల్ డిస్కషన్.. బ్యాటిల్ ఫీల్డ్ లో…