Election Campaign : రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభలు, రోడ్ షోలు.. తెలంగాణలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది.

Election Campaign : రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభలు, రోడ్ షోలు.. తెలంగాణలో నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

Telangana election campaign

Telangana Election Campaign : తెలంగాణలో ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇవాళ చివరి రోజు కావడంతో రాజకీయ నాయకులు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. పలు రాజకీయ పార్టీల నేతలు ఇవాళ అధిక ప్రాంతాల్లో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. వీలైనన్నీ సభలు, సమావేశాలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ లు నిర్వహించాలని ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా ఆఖరి రోజైన మంగళవారం కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

కామారెడ్డి, మల్కాజ్ గిరిల్లో రేవంత్ రెడ్డి ప్రచారం

మంగళవారం కామారెడ్డి, మల్కాజ్ గిరి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. కామారెడ్డి పట్టణం, దోమకొండలో రోడ్ షో లో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఉదయం 10గంటలకు కామారెడ్డి పట్టణంలో రోడ్ షో, ఉదయం 11 గంటలకు దోమకొండలో రోడ్ షో నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మల్కాజ్ గిరిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్ రెడ్డి రోడ్ షో లో పాల్గొననున్నారు.

Telangana Assembly Election 2023 : పోటాపోటీగా ఓటరు స్లిప్పుల పంపిణీ…ఇంటింటికి కార్యకర్తల బృందాలు

హైదరాబాద్ లో రాహుల్ గాంధీ రోడ్ షో, కార్నర్ మీటింగ్

ఇవాళ హైదరాబాద్ లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రోడ్ షో, కార్నర్ మీటింగ్స్ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్, మధ్యాహ్నం 12 గంటలకు నాంపల్లి, మధ్యాహ్నం 2 గంటలకు మల్కాజ్ గిరి ఆనంద్ బాగ్ చౌరస్తాలో రోషో, కార్నర్ మీటింగ్ ల ద్వారా ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ప్రియాంక గాంధీ ప్రచార షెడ్యూల్
ప్రియాంక గాంధీ ఇవాళ జహీరాబాద్, మల్కాజ్ గిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జహీరాబాద్ లో ప్రియాంక గాంధీ ప్రచారం చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం 2:30 గంటలకు మల్కాజ్ గిరిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని, ప్రసంగించనున్నారు.

Ronald Ross : ఓటర్ల కోసం కొత్త యాప్, 4వేల పోలింగ్ స్టేషన్లు- హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర
తెలంగాణలో నేటితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనుంది. సాయంత్రం 5 గంటల నుంచి రాష్ట్రంలో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. ఎక్కడ కూడా నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడవద్దు.

సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు : ఈసీ

నవంబర్ 30వ తేదీ పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచి సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సాయంత్రం 5 గంటల తరువాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం చేయవద్దని ఈసీ సూచించింది.

సాయంత్రం 5 గంటల తరువాత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ ఉంటుంది.