Priyanka Gandhi : దేశంలో ఫామ్ హౌస్ లో ఉండి పాలించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ : ప్రియాంక గాంధీ

తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. రెండు లక్షల వరకు ఏక కాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు.

Priyanka Gandhi : దేశంలో ఫామ్ హౌస్ లో ఉండి పాలించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ : ప్రియాంక గాంధీ

Priyanka Gandhi (1)

Priyanka Gandhi – KCR : బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకటేనని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలో ఫామ్ హౌస్ లో ఉండి పాలించే ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఓవైసీ పోటీ చేస్తారు కానీ, తెలంగాణలో అన్నిచోట్ల ఎందుకు పోటీ చేయరని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో జరిగిన కార్నర్ మీటింగ్ లో ప్రియాంక గాంధీ మాట్లాడారు.

అక్రమాలతో దేశంలో బీజేపీ, రాష్ట్రంలో బయారేస్ ధనిక పార్టీలుగా మారాయని పేర్కొన్నారు. రూ.16 వేల కోట్లతో విమానాలు, అదాని రుణాలు మాఫీ చేసే ప్రధాని మోదీకి పేదల రుణాల మాఫీ గుర్తుకు రాదని ఎద్దేవా చేశారు. ఛత్తీస్ గడ్, కర్ణాటక ప్రభుత్వాల తరహాలో తెలంగాణలో సంక్షేమ పాలన అందిస్తామని తెలిపారు. కరోనా సమయంలో దేశ ప్రజలు అల్లాడితే ఆదుకోవడంలో మోదీ విఫలం చెందారని విమర్శించారు.

Rahul Interaction : చివరి రోజు హైదరాబాద్ లో రాహుల్ గాంధీ ప్రచారం.. వివిధ వర్గాల వర్కర్స్ తో మాటామంతి

తెలంగాణలో అధికారంలోకి వస్తే మొదటి మంత్రివర్గంలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు. రెండు లక్షల వరకు ఏక కాలంలో రైతుల రుణాలు మాఫీ చేస్తామని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ 24 గంటలు పనిచేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కు బాయ్ బాయ్ చెప్పే సమయం ఆసన్నం అయిందని తెలిపారు. జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

చక్కెర ఫ్యాక్టరీ పునఃప్రారంభానికి కాంగ్రెస్ కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. దొరల తెలంగాణ కావాలో ప్రజల తెలంగాణ కావాలో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి పాటకు ప్రియాంక గాంధీ స్టెప్పులేస్తూ ఉల్లాసపరిచారు. ముస్లిం మహిళ చంటి బిడ్డను వేదికపైకి పిలిచి వారి క్షేమాలు అగిగి తెలుసుకున్నారు. ప్రియాంక గాంధీ కార్నర్ మీటింగ్ తో జహీరాబాద్ జనసంద్రంలా మారింది.