Mokshagna : ఓటేయడానికి వచ్చిన మోక్షజ్ఞ.. ఇంత సన్నబడ్డాడేంటి? సినిమా కోసమేనా?

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఓటేసినట్టు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ కూడా ఓటేయడానికి వచ్చాడు. తన అమ్మమ్మతో కలిసి మోక్షజ్ఞ ఓటేయడానికి..................

Mokshagna : ఓటేయడానికి వచ్చిన మోక్షజ్ఞ.. ఇంత సన్నబడ్డాడేంటి? సినిమా కోసమేనా?

Nandamuri Mokshagna Latest Video goes Viral

Nandamuri Mokshagna : నందమూరి వారసుడు, బాలకృష్ణ(Balakrishna) తనయుడు మోక్షజ్ఞ మరోసారి మీడియా కంటపడ్డాడు. నేడు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మన టాలీవుడ్ సెలబ్రిటీలంతా కుడా హైదరాబాద్ లో ఓట్లెయడానికి క్యూ కట్టారు. ఇప్పటికే చిరంజీవి, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగార్జున, విజయ్ దేవరకొండ.. లాంటి స్టార్ హీరోలతో పాటు రాజమౌళి, సుకుమార్, శేఖర్ కమ్ముల.. మరింతమంది దర్శకులు.. ఇంకా అనేకమంది సినిమా, టీవీ సెలబ్రిటీలు వచ్చి ఓటేశారు.

ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఓటేసినట్టు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నందమూరి మోక్షజ్ఞ కూడా ఓటేయడానికి వచ్చాడు. తన అమ్మమ్మతో కలిసి మోక్షజ్ఞ ఓటేయడానికి కారులో వచ్చి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో తన ఓటు ఉన్న పోలింగ్ బూత్ లో ఓటేసి వెళ్ళాడు. ప్రస్తుతం మోక్షజ్ఞ వీడియో వైరల్ గా మారింది.

మోక్షజ్ఞ ఈ వీడియోలో బాగా సన్నపడి ఉన్నాడు. లాస్ట్ టైం భగవంత్ కేసరి సినిమా టైంలో మోక్షజ్ఞ చివరిసారి కనపడ్డాడు. అప్పుడు కూడా అంతకు ముందు కంటే కొంచెం బరువు తగ్గినా కొంచెం లావుగానే కనపడ్డాడు. ఇప్పుడు చూస్తే అప్పటికంటే చాలా సన్నగా కనపడ్డాడు. దీంతో మోక్షజ్ఞ ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Also Read : Celebrities Vote : ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కి టాలీవుడ్ సెలబ్రిటీస్.. గ్యాలరీ!

అయితే మోక్షజ్ఞ సినిమా కోసమే సన్నబడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల బాలయ్య కూడా త్వరలోనే మోక్షజ్ఞని హీరోని చేస్తానని, శ్రీలీల హీరోయిన్ గా ఉండొచ్చని కూడా చెప్పాడు. దీంతో ఈ నందమూరి వారసుడి కోసం అభిమానులుఎదురు చూస్తున్నారు. మరి మోక్షజ్ఞ ఇంత సన్నబడి బాడీ మెయింటైన్ చేసేది సినిమా కోసమే అయితే ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.