CM Revanth Reddy : సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. పరిపాలనలో, ప్రజలకు సేవ చేయడంలో సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నా

CM Revanth Reddy : సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. సీఎం జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..

Chandrababu Congrats CM Revanth Reddy (Photo : Google)

తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రాజకీయ, సినీ, బిజినెస్ రంగ ప్రముఖులు ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రేవంత్ రెడ్డికి విషెస్ చెప్పారు.

ఏపీ, తెలంగాణ మధ్య సహకారం ఉండాలి- సీఎం జగన్
తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సహకారం ఉండాలని జగన్ ఆకాంక్షించారు. ”తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు జగన్.

Also Read : రేవంత్ రెడ్డి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం ఎలా జరిగిందంటే.. ముఖ్యమైన విషయాలు ఇవే..

”తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. పరిపాలనలో సక్సెస్ అవ్వాలని, ప్రజా సేవలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా” అని చంద్రబాబు ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి పదవీ కాలం విజయవంతంగా సాగాలని చంద్రబాబు కోరుకున్నారు. 2009, 2014 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే. 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు రేవంత్ రెడ్డి.

”తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు. ఆయన మంత్రి వర్గ సహచరులకు శుభాబినందనలు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా” అని ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.

Also Read : ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం

 

 

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు. శ్రీ రేవంత్ రెడ్డి గారితో నాకు వ్యక్తిగతంగా స్నేహం ఉంది. తెలంగాణలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొని తమ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారు. వాగ్ధాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాలపై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు. నీళ్ళు, నిధులు, నియామకాలు.. ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత.. ఏ ఆశయాల కోసం ఆత్మ బలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్ధకతను కల్పించాలి. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకోంటున్నా.
ఇట్లు
పవన్ కల్యాణ్
అధ్యక్షులు-జనసేన పార్టీ

తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రగతికి, ప్రజల సంక్షేమానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తానని హామీ ఇచ్చారు ప్రధాని మోదీ.