Bigg Boss 7 Final : బిగ్‌బాస్ ఫినాలే ప్రోమో చూశారా? రవితేజ గెస్ట్‌గా.. అమర్ దీప్‌కి నాగ్ బంపర్ ఆఫర్..

ఫైనల్ కి అర్జున్, ప్రియాంక జైన్, శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్ వచ్చిన సంగతి తెలిసిందే.

Bigg Boss 7 Final : బిగ్‌బాస్ ఫినాలే ప్రోమో చూశారా? రవితేజ గెస్ట్‌గా.. అమర్ దీప్‌కి నాగ్ బంపర్ ఆఫర్..

Bigg Boss 7 Final Promo Released Raviteja as Final Guest

Bigg Boss 7 Final : గత 15 వారాలుగా సాగుతున్న బిగ్‌బాస్ నేడు ఫైనల్ కి వచ్చింది. తాజాగా ఫైనల్ కి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. కింగ్ నాగార్జున స్పెషల్ గా ఎంట్రీ ఇవ్వగా బబుల్ గమ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమ, సుమ తనయుడు రోషన్, హీరోయిన్ భావన వచ్చారు. ఆ తర్వాత నా సామిరంగ ప్రమోషన్స్ లో భాగంగా ఆషిక రంగనాథ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వచ్చారు. ఈ సీజన్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా వచ్చారు. ఇక నిధి అగర్వాల్, చంద్రిక రవి, నేహా శెట్టి లు స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు చేశారు. చివర్లో రవితేజ వచ్చాడు. బిగ్‌బాస్ విన్నర్ టైటిల్ రవితేజతోనే ఇప్పిస్తారని తెలుస్తుంది.

ఫైనల్ కి అర్జున్, ప్రియాంక జైన్, శివాజీ, యావర్, ప్రశాంత్, అమర్ దీప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఫైనల్ ఎపిసోడ్ షూటింగ్ అయిపోగా బిగ్‌బాస్ లీక్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం యావర్ ఆఫర్ చేసిన డబ్బులు తీసుకొని వెళ్లిపోగా ప్రశాంత్ విన్నర్ అయ్యాడని సమాచారం. మరి అధికారికంగా తెలియాలి అంటే ఇవాళ రాత్రి దాకా వెయిట్ చేయాల్సిందే.

Also Read : Bagheera Teaser : ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా ‘భగీరా’ టీజర్ చూశారా.. సలార్ కంటే పవర్ ఫుల్ గా..

ప్రోమో అయితే ఆసక్తికరంగా సాగింది. చివర్లో నాగార్జున రవితేజ రావడంతో అతనికి వీరాభిమాని అయిన అమర్ దీప్ కి షో ఫైనల్ వదిలేసుకొని బయటకి వచ్చేస్తే రవితేజ నెక్స్ట్ సినిమాలో అతనితో కలిసి నటిస్తావ్ అని చెప్పాడు. దీంతో అమర్ దీప్ మరి బయటకి వచ్చేసాడా? లేదా చూడాలి.