IPL 2024 Auction : ఐపీఎల్ వేలంలో భారీ ధర లభించడంపై మిచెల్ స్టార్క్ ఏమన్నాడో తెలుసా?.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ దక్కించుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది.

IPL 2024 Auction : ఐపీఎల్ వేలంలో భారీ ధర లభించడంపై మిచెల్ స్టార్క్ ఏమన్నాడో తెలుసా?.

IPL auction 2024

Mitchell Starc : క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2024) వేలం మంగళవారం ముగిసింది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన‌ ఈ వేలంలో ఆట‌గాళ్ల‌పై కోట్ల వ‌ర్షం కురిసింది. మొద‌టి సారి భార‌తదేశం వెలుప‌ల జ‌రిగిన వేలంలో ప‌లువురు ఆట‌గాళ్లు రికార్డు ధ‌ర‌ల‌కు అమ్ముడు పోయారు. టోర్నీ చ‌రిత్ర‌లోనే అత్య‌ధికంగా మిచెల్ స్టార్క్ రూ.24.75 కోట్ల‌కు కోల్‌క‌తా సొంతం చేసుకోగా, పాట్ క‌మిన్స్‌ను రూ.20.50 కోట్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ దక్కించుకుంది. ఆ త‌రువాత డారిల్ మిచెల్ రూ.14 కోట్ల‌కు చెన్నై కొనుగోలు చేసింది. ఈ వేలంలో పలువురి విదేశీ ఆటగాళ్లపై ప్రాంచైజీలు కాసుల వర్షం కురిపించాయి.

Also Read : IPL auction 2024 : పాపం స్మిత్.. కనీస ధర రూ.2కోట్లు దెబ్బకొట్టిందా? వేలంలో అమ్ముడుపోని స్టార్ ప్లేయర్స్ వీళ్లే

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరను ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ దక్కించుకున్నాడు. కోల్ కతా నైట్ రైడర్స్ రూ.24.75 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. మిచెల్ స్టార్క్ భారీ ధర పలకడం పట్ల పలువురు మాజీ క్రికెటర్లు, క్రీడాభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసే బౌలర్ కు వేలంలో ఇంత భారీ మొత్తం చెల్లించాలా? అంటూ ప్రశ్నించారు. తాజాగా మిచెల్ స్టార్క్ వీడియోను విడుదల చేశారు.

Also Read : IPL auction 2024 : ముగిసిన ఐపీఎల్ వేలం.. ఏ జ‌ట్టు ఎవ‌రిని ఎంత ధ‌ర‌కు కొనుగోలు చేశాయంటే..? టాప్‌-5 ఆట‌గాళ్లు వీరే..

హాయ్ కేకేఆర్ (కోల్ కతా నైట్ రైడర్స్) ఫ్యాన్స్. ఈ ఏడాది ఐపీఎల్ లో కేకేఆర్ జట్టులో చేరినందుకు థ్రిల్ గా ఉన్నాను. హోం ఫ్యాన్స్, వాళ్ల అభిమానాన్ని, ఆనందకరమైన వాతావరణాన్ని ఈడెన్ గార్డెన్ లో అనుభవించడానికి వేచిఉండలేక పోతున్నాను.. మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నానంటూ మిచెల్ స్టార్క్ ట్విటర్ లో వీడియోను షేర్ చేశారు. ఆ తరువాత మిచెల్ జియో సినిమాతో డిబేట్ లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కేకేఆర్ జట్టులో ఆడేందుకు ఎదురు చూస్తున్నానని చెప్పాడు. అత్యధిక ధర దక్కిందన్న విషయాన్ని తెలుసుకున్నప్పుడు మీరెలా రియాక్ట్ అయ్యారని ప్రశ్నించగా.. నేను ఆశ్చర్యపోయాను. ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. నాభార్య అలీస్సా హీలీ భారత్ లోనే మహిళల జట్టుతో ఉంది అని స్టార్క్ తెలిపారు.