Salaar : సీక్రెట్‌గా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫీల్ అవుతున్న ప్రభాస్ అభిమానులు..
సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్మాతలు నిర్వహించలేదు. ఇప్పుడు సినిమా సక్సెస్ అయ్యింది. సక్సెస్ ఈవెంట్ ని అయినా గ్రాండ్ గా చేస్తారని భావించారు. కానీ..
![Salaar : సీక్రెట్‌గా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫీల్ అవుతున్న ప్రభాస్ అభిమానులు.. Salaar : సీక్రెట్‌గా సలార్ సక్సెస్ సెలబ్రేషన్స్.. ఫీల్ అవుతున్న ప్రభాస్ అభిమానులు..](https://10tv.in/wp-content/uploads/2023/12/Prabhas-Prithviraj-Sukumaran-Shruti-Haasan-in-Salaar-celebrations-photo-viral.jpg)
Prabhas Prithviraj Sukumaran Shruti Haasan in Salaar celebrations photo viral
Salaar : ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో ప్రశాంత్ నీల్ రెండు భాగాలుగా రూపొందించిన చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఖాన్సార్ అనే ఓ అండర్ వరల్డ్ క్రైమ్ సిటీ సింహాసనం కోసం జరిగే యుద్ధం నేపథ్యంతో తెరకెక్కింది. దీంతో ప్రభాస్ చాలా కాలం తరువాత ఒక మాస్ క్యారెక్టర్ లో కనిపించారు. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం.. ఆ అంచనాలను అందుకొని బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ ని నమోదు చేస్తుంది.
కాగా ఈ చిత్రం రీసెంట్ గా 500 కోట్ల మార్క్ ని క్రాస్ చేసినట్లు మేకర్స్ తెలియజేశారు. ఇండియా, ఓవర్ సీస్ల్లో మూవీకి భారీ రెస్పాన్స్ వస్తుండడం, కలెక్షన్స్ జోరు ఉత్సాహభరితంగా ఉండడంతో మూవీ టీం ఫుల్ ఖుషీలో ఉంది. ఇక ఖుషీని మూవీ టీం అంతా కలిసి సెలబ్రేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ లోని ఏదో హోటల్ ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ సీక్రెట్ గా జరిగినట్లు తెలుస్తుంది.
Also read : Super Stars Comebacks in 2023 : ఈ టాప్ స్టార్స్‌కి 2023 గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది
ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆ ఫొటోలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కలిసి కనిపిస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్మాతలు నిర్వహించలేదు. ఇప్పుడు సినిమా సక్సెస్ అయ్యింది. సక్సెస్ ఈవెంట్ ని అయినా గ్రాండ్ గా చేస్తారని భావించారు. కానీ ఇప్పుడు ఈ వార్త విన్న తరువాత.. దీనిని కూడా ఇలా సింపుల్ చేసేసారు అని ఫీల్ అవుతున్నారు.
Devaratha – Aadya – VardharajaMannar 😍#Salaar#Prabhas#ShrutiHaasan#PrithviRaj #SalaarCeaseFireHits500Crs pic.twitter.com/nBau9EyfTI
— PrabhaSree🖤 (@TwilightDazzzle) December 28, 2023
కాగా వరల్డ్ వైడ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 350 కోట్ల వరకు జరిగినట్లు చెబుతున్నారు. అంటే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే.. 350 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్, 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టాలి. మొదటి వారం పూర్తి కాకుండానే 500 కోట్ల మార్క్ ని అందుకున్న ఈ చిత్రం.. మరో 200 కోట్ల గ్రాస్ ని మరికొన్ని రోజుల్లోనే రాబట్టేస్తుంది అన్నడంలో సందేహం అవసరం లేదు.