IND vs SA 2nd Test : రెండో టెస్టుకు ముందు ద‌క్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. ఇంత‌కంటే మంచి అవ‌కాశం భార‌త్‌కు దొర‌క‌దు

భార‌త్ పై విజ‌యం సాధించి మంచి జోష్‌లో ఉన్న ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది.

IND vs SA 2nd Test : రెండో టెస్టుకు ముందు ద‌క్షిణాఫ్రికాకు భారీ షాక్‌.. ఇంత‌కంటే మంచి అవ‌కాశం భార‌త్‌కు దొర‌క‌దు

IND vs SA 2nd Test

India vs South africa 2nd Test : సెంచూరియ‌న్ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టెస్టు మ్యాచులో భార‌త్ పై విజ‌యం సాధించి మంచి జోష్‌లో ఉన్న ద‌క్షిణాఫ్రికా జ‌ట్టుకు భారీ షాక్ త‌గిలింది. మొద‌టి టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆట‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయ‌ప‌డిన కెప్టెన్ టెంబా బావుమా ఇప్ప‌టికే రెండో టెస్టుకు దూరం అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా మ‌రో ఆట‌గాడు సైతం రెండో టెస్టు నుంచి త‌ప్పుకున్నాడు. యువ పేస‌ర్ గెరాల్డ్ కోయెట్జీ రెండో టెస్టుకు దూరం అయిన‌ట్లు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. అత‌డు కటి వాపుతో బాధ‌ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది.

గాయం కార‌ణంగానే అత‌డు కేప్‌టౌన్ వేదిక‌గా జ‌న‌వ‌రి మూడు నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచులో ఆడ‌డం లేద‌ని బోర్డు తెలియ‌జేసింది. కాగా.. కోయెట్జీ సెంచూరియ‌న్ టెస్టులో పెద్ద‌గా ప్ర‌భావం చూప‌లేదు. రెండు ఇన్నింగ్స్‌ల్లో క‌లిపి కేవ‌లం ఒక్క వికెట్ మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. అయితే.. అంత‌క‌ముందు భార‌త్‌తో జ‌రిగిన టీ20, వ‌న్డే సిరీస్‌ల్లో మాత్రం స‌త్తాచాటాడు. త‌న‌దైన రోజున ఎలాంటి బ్యాట‌ర్‌కు అయినా చుక్క‌లు చూపిస్తాడు.

Irfan Pathan : సునీల్ గ‌వాస్క‌ర్‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇర్ఫాన్ ప‌ఠాన్‌.. అంగీకరించ‌ని దిగ్గ‌జ ఆట‌గాడు.. ఇద్ద‌రి మ‌ధ్య ఏం జ‌రిగిందంటే..?

Gerald Coetzee

Gerald Coetzee

కాగా.. ఇప్ప‌టికే వారి స్టార్ పేస‌ర్ లుంగి ఎంగిడి మొద‌టి టెస్టు మ్యాచ్‌కు దూరం కాగా రెండో టెస్టు మ్యాచులోనూ అత‌డు ఆడ‌డం అనుమానంగానే ఉంది. ఇప్పటి వ‌ర‌కు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు లుంగి ఎంగిడి, కోయెట్జీల‌కు ప్ర‌త్యామ్నాయ ఆట‌గాళ్ల‌ను ప్ర‌క‌టించ‌లేదు. అయితే.. వియాన్ ముల్డర్‌లో రూపంలో ఓ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ జ‌ట్టులో ఉన్నాడు.

భార‌త్‌తో సిరీస్‌కు దక్షిణాఫ్రికా టెస్ట్ జట్టు : డేవిడ్ బెడింగ్‌హామ్, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, డీన్ ఎల్గర్ (కెప్టెన్‌), మార్కో జాన్సెన్‌, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, లుంగీ ఎంగిడి, కీగన్ పీటర్‌సన్, కగిసో ర‌బాడ, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్ (వికెట్ కీప‌ర్‌).

MS Dhoni : ఆహారం కోసం పాకిస్తాన్‌కు వెళ్లండి.. అభిమానికి ధోని స‌ల‌హా..! వీడియో వైర‌ల్‌