Corn Crop : మొక్కజొన్నలో కత్తెర పురుగును అరికట్టండి ఇలా..

Armyworm Management in Corn Crop : సాధారణంగా ఖరీఫ్‌, రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కత్తెర పురుగు తయారైంది. ఈ రబీలో అయినా ఆ లోటు పూడ్చుకుందామంటే.. మళ్లీదాపురించిందంటు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Corn Crop : మొక్కజొన్నలో కత్తెర పురుగును అరికట్టండి ఇలా..

Armyworm Management in Corn Crop

Armyworm Management in Corn Crop : మొక్కజొన్న పంటకు  కత్తెరపురుగు మహమ్మారిలా దాపురించింది. గత ఏడాది  ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆలోటును పూడ్చుకుందామని.. ఈ రబీ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా మొక్కజొన్నను సాగుచేశారు రైతులు. ప్రస్తుతం 20 నుండి 45 రోజుల దశలో ఉంది. అయితే నిర్మల్ జిల్లా ప్రాంతంలో కత్తెర పురుగు ఉధృతి పెరిగి పంటకు తీవ్రనష్టం చేస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also : Migjaum Effect on Crops : తెలుగు రాష్ట్రాల్లో పంటలపై ప్రభావం చూపిన మిగ్‌జామ్ తుఫాన్

తెలుగు రాష్ట్రాల్లో రబీలో అత్యధికంగా సాగవుతున్న పంట మొక్కజొన్న. సాధారణంగా  ఖరీఫ్‌, రబీ కాలాల్లో ఈ పంటకు ప్రధాన సమస్య కత్తెర పురుగు తయారైంది. నిర్మల్ జిల్లాలో దాదాపు లక్ష ఎకరాల్లో సాగుచేశారు రైతులు ప్రస్తుతం సున్నిత దశలో ఉన్న ఈ పంటను కత్తెర పురుగు తీవ్రంగా నష్టపరుస్తోంది. రైతులు ఎన్ని రసాయన మందులను పిచికారి చేసినా  అరికట్టలేక పోతున్నారు.

నివారణకు చేపట్టాల్సిన జాగ్రత్తలు :
దీని ఉధృతి పెరిగే ఖరీఫ్ లో వేసిన పంటపై ఆశలు వదిలేసిన రైతులు .. ఈ రబీలో అయినా ఆలోటు పూడ్చుకుందామంటే.. మళ్లీదాపురించిందంటు.. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా ఎదుర్కొన్న చేదు అనుభవాలను దృష్టిలో వుంచుకుని, కత్తెర పురుగు పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి.  పైరు తొలిదశ నుండే ఈ పురుగు ఉనికి కనిపిస్తోంది కనుక, దీని నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు వ్యవసాయ అధికారి నాగరాజు.

Read Also : Chilli Crop Cultivation : మిరప తోటల్లో వైరస్ తెగులు ఉధృతి – నివారణకు చేపట్టాల్సిన యాజమాన్యం