Telangana BJP : పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్.. నియోజకవర్గాలకు ఇంచార్జులు వీరే

తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. అత్యధిక స్థానాల్లో విజయం సాధించేలా ప్రణాళికతో ముందుకెళ్తుంది. ఈ క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇంచార్జిలను నియమించింది.

Telangana BJP : పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్.. నియోజకవర్గాలకు ఇంచార్జులు వీరే

Telangana BJP

Lok Sabha elections 2024 : లోక్ సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. మరో మూడు నాలుగు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. మరోసారి దేశవ్యాప్తంగా అత్యధిక లోక్ సభ స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో తెలంగాణపైనా బీజేపీ అధిష్టానం ప్రత్యేక దృష్టిసారించింది. 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మెజార్టీ నియోజకవర్గాల్లో బీజేపీ జెండాను ఎగురవేసేలా ఆ పార్టీ అధిష్టానం పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇంచార్జ్ లను నియమించింది.

Also Read : Congress Party : టార్గెట్ లోక్‌స‌భ‌ ఎలక్షన్స్.. తెలుగు రాష్ట్రాలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి.. కో-ఆర్డినేటర్ల నియామకం

ఎనిమంది మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు పార్లమెంట్ నియోజకవర్గాల ఇంచార్జ్ లుగా బాధ్యలు అప్పగిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

అదిలాబాద్ – పాయక్ శంకర్ (ఎమ్మెల్యే)
పెద్దపల్లి – రామారావు పవార్ (ఎమ్మెల్యే)
కరీంనగర్ – ధనపాల్ సూర్యనారాయణ గుప్తా (ఎమ్మెల్యే)
నిజామాబాద్ – ఏలేటి మహేశ్వరరెడ్డి (ఎమ్మెల్యే)
జహీరాబాద్ – కాటేపల్లి వెంకటరమణ రెడ్డి (ఎమ్మెల్యే)
మెదక్ – పాల్వాయి హరీశ్ బాబు (ఎమ్మెల్యే)
మల్కాజిగిరి – పైడి రాకేశ్ రెడ్డి (ఎమ్మెల్యే)
సికింద్రాబాద్ – కె. లక్ష్మణ్ (ఎంపీ)
హైదరాబాద్ – రాజాసింగ్ (ఎమ్మెల్యే)
చేవెళ్ల – ఏవీఎన్ రెడ్డి (ఎమ్మెల్సీ)
మహబూబ్ నగర్ – రామచంద్రరావు (మాజీ ఎమ్మెల్సీ)
నాగర్ కర్నూల్ – మాగం రంగారెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)
నల్గొండ – చింతల రామచంద్రారెడ్డి (మాజీ ఎమ్మెల్యే)
భువనగిరి – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ (మాజీ ఎమ్మెల్యే)
వరంగల్ – మర్రి శశిధర్ రెడ్డి (మాజీ మంత్రి)
మహబూబాబాద్ – గరికపాటి మోహన్ రావు (మాజీ ఎంపీ)
ఖమ్మం – పొంగులేటి సుధాకర్ రెడ్డి (మాజీ ఎమ్మెల్సీ)