IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..! క‌ష్టాలు త‌ప్పేలా లేవుగా..!

ఇంగ్లాండ్‌తో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది.

IND vs ENG : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..! క‌ష్టాలు త‌ప్పేలా లేవుగా..!

Team India

India vs England : ఇంగ్లాండ్‌తో స్వ‌దేశంలో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ త‌గిలింది. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ప్ర‌త్య‌ర్థుల‌కు చుక్క‌లు చూపించిన స్టార్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న మొద‌టి రెండు టెస్టు మ్యాచుల‌కు అందుబాటులో ఉండ‌డం లేద‌ని తెలుస్తోంది. అత‌డితో పాటు టీ20ల్లో నంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ అయిన సూర్య‌కుమార్ యాద‌వ్ మొత్తం టెస్టు సిరీస్‌కు దూరం అయ్యాడ‌ని వార్త‌లు వస్తున్నాయి.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో మ‌హ్మ‌ద్ ష‌మీ గాయ‌ప‌డ్డాడు. అయిన‌ప్ప‌టికీ నొప్పిని భ‌రిస్తూనే టోర్నీ మొత్తం ఆడాడు. మెగాటోర్నీ ముగిసిన త‌రువాత నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఫిట్‌నెస్ లేమి కార‌ణంగా ద‌క్షిణాప్రికాతో రెండు టెస్టు మ్యాచుల సిరీస్ నుంచి త‌ప్పుకున్నాడు. అత‌డు ఇప్ప‌టి వ‌ర‌కు బౌలింగ్ చేయ‌డం ప్రారంభించ‌లేద‌ని, బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ) వెళ్లి అక్క‌డ ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉందని, ఈ క్ర‌మంలోనే అత‌డు ఇంగ్లాండ్‌తో మొద‌టి రెండు టెస్టు మ్యాచులు ఆడేది అనుమాన‌మేన‌ని బీసీసీ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపిన‌ట్లు ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ త‌న క‌థ‌నంలో తెలిపింది.

Esha Singh : పారిస్ ఒలింపిక్స్ బెర్తును ఖరారు చేసుకున్న తెలంగాణ అమ్మాయి.. స్పందించిన ఎమ్మెల్సీ క‌విత

ద‌క్షిణాప్రికా ప‌ర్య‌ట‌న‌లో సూర్య‌కుమార్ యాద‌వ్ గాయ‌ప‌డ్డాడు. అత‌డు స్పోర్ట్స్ హెర్నియాతో బాధ‌ప‌డుతున్నాడు. త్వ‌ర‌లోనే అత‌డు ఆప‌రేష‌న్ చేయించుకోనున్నాడు. అత‌డు కోలుకునేందుకు ఏడు నుంచి తొమ్మిది వారాల స‌మ‌యం ప‌డుతుంది. ఈ క్ర‌మంలో అత‌డు ఐపీఎల్‌లోని ఆరంభ మ్యాచుల‌కు దూరం అయ్యే అవ‌కాశం ఉంద‌ని బీసీసీఐ వ‌ర్గాలు తెలిపాయి. కాగా.. జూన్‌లో వెస్టిండీస్‌, అమెరికా వేదిక‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024 జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీకి సూర్య దూరం అయితే అది భార‌త విజ‌యావ‌కాశాల‌పై ప్ర‌భావం చూపొచ్చు.

Kapil Dev : ఇంట‌ర్నెట్‌ను ఊపేస్తున్న క‌పిల్‌దేవ్ డ్యాన్స్‌.. ఎవ‌రితో, ఏ పాట‌కో తెలుసా?

భార‌త్ vs ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..

ఉప్ప‌ల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జ‌న‌వ‌రి 25న జ‌ర‌గ‌బోయే టెస్టుతో భార‌త్ vs ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ మొద‌లుకానుంది.
మొద‌టి టెస్టు – జ‌న‌వ‌రి 25 నుంచి 29 వ‌ర‌కు – ఉప్ప‌ల్‌
రెండో టెస్టు – ఫిబ్ర‌వ‌రి 2 నుంచి 6 వ‌ర‌కు – విశాఖ‌ప‌ట్నం
మూడో టెస్టు – ఫిబ్ర‌వ‌రి 15 నుంచి 19 వ‌ర‌కు – రాజ్‌కోట్‌
నాలుగో టెస్టు – ఫిబ్ర‌వ‌రి 23 నుంచి 27 వ‌ర‌కు – రాంచీ
ఐదో టెస్టు – మార్చి 7 నుంచి 11 వ‌ర‌కు – ధ‌ర్మ‌శాల‌