IND vs PAK : టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ కోసం డ్రాప్‌-ఇన్ పిచ్‌..! అంటే ఏమిటో తెలుసా?

జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

IND vs PAK : టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. భార‌త్‌, పాకిస్తాన్ మ్యాచ్ కోసం డ్రాప్‌-ఇన్ పిచ్‌..! అంటే ఏమిటో తెలుసా?

India vs Pakistan : జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పొట్టి స‌మ‌రం ఆరంభం కావ‌డానికి మ‌రో నాలుగు నెల‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. వెస్టిండీస్‌, అమెరికాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నీలో అందరి దృష్టి భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ పైనే ఉంది అన‌డంలో ఎటువంటి సందేహం లేదు. జ‌న‌వ‌రి 9న ఈ మ్యాచ్ న్యూయార్క్‌లో జ‌ర‌గ‌నుంది.

చిర‌కాల ప్ర‌త్య‌ర్థుల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కోసం న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు. ఫార్ములావ‌న్ స‌ర్య్కూట్ నుంచి సీట్లు తెప్పించి మ‌రీ బిగిస్తున్నారు. దాదాపు 34 వేల మంది ప్ర‌త్య‌క్షంగా మ్యాచ్ వీక్షించ‌వ‌చ్చున‌ని అంటున్నారు. ఇందుకు సంబంధించిన ప‌నులు ప్రారంభం అయ్యాయి.

Rahane : రంజీట్రోఫీలో ర‌హానే భీభ‌త్సం..! ఇలా ఆడితే రీ ఎంట్రీ మ‌రిచిపోవాల్సిందే..!

ఆస్ట్రేలియా నుంచి పిచ్‌..

మామూలుగా మైదానంలోని నేల పిచ్ త‌యారీకి అంత అనుకూలంగా లేన‌ట్ల‌యితే.. డ్రాప్ ఇన్ పిచ్‌ల‌ను ఉప‌యోగిస్తారు. ఇదే ప‌ద్దతిని టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ ఉప‌యోగిస్తున్నారు. ఈ పిచ్‌ల‌ను త‌యారీలో సిద్ద‌హ‌స్తుడైన అడిలైడ్ ఓవ‌ర్ క్యూరేట‌ర్ డానియ‌న్ హోతో ఇప్ప‌టికే ఐసీసీ ఒప్పందం చేసుకుంది. భార‌త్‌, పాక్ మ‌ధ్య జ‌రిగే మ్యాచ్ కోసం డానియ‌న్ బృందం అడిలైడ్‌లో డ్రాప్ ఇన్ పిచ్‌ను త‌యారు చేస్తోంది.

పిచ్ మిశ్ర‌మాన్ని ట్రేల‌లో ఉంచి దానిని కంటైనర్ల ద్వారా మ్యాచ్ జ‌రిగే ప్రాంతాల‌కు త‌ర‌లిస్తారు. గ్రౌండ్‌లో ట్రేల‌ను అమ‌ర్చి పిచ్‌ను సిద్ధం చేస్తారు. అంతేకాకుండా మైదానాన్ని మ్యాచ్‌కు అనుగుణంగా చేయ‌డంతో పాటు డ్రైనేజీ సౌక‌ర్యాల‌ను మెరుగు ప‌రిచే ప్ర‌క్రియ జ‌రుగుతున్న‌ట్లు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ డైరెక్ట‌ర్ క్రిస్ టెట్లీ చెప్పారు. ఇక భార‌త్‌, పాక్ పోరు కోసం ఏర్పాటు చేసే సీట్లు అన్ని తాత్కాలికమైనవే కావ‌డం గ‌మ‌నార్హం. ఫార్ములావ‌న్ స‌ర్య్కూట్ నుంచి వీటిని అద్దె ప్రాతిప‌దిక‌న తెప్పిస్తున్నారు.

WTC Points table : ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్‌..