Raja Singh: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

అమెరికాతో పాటు థాయ్‌లాండ్, యూరప్‌లో మన దేవుళ్లను ముద్రించి చెలామణిలో ఉంచారని రాజాసింగ్ చెప్పారు.

Raja Singh: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం వేళ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు

Raja Singh

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరగనున్న వేళ బీజేపీ ఎమ్మెల్యే, తెలంగాణ నేత రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర శంబాజీపూర్‌లో ఆయన మాట్లాడుతూ… రూ.500 నోటుపై శ్రీరాముడి ఫోటోను ముద్రించాలని డిమాండ్ చేశారు. అలా ఎందుకు ముద్రించాలన్న విషయాన్ని వివరించి చెప్పే ప్రయత్నం చేశారు.

అమెరికాతో పాటు థాయ్‌లాండ్, యూరప్‌లో మన దేవుళ్లను ముద్రించి చెలామణిలో ఉంచారని రాజాసింగ్ చెప్పారు. అంతేగాక, 80 శాతం ముస్లింలు ఉన్న ఇండొనేషియాలో కరెన్సీపై కూడా మన దేవుళ్ల ఫొటోలు ఉంటాయన్నారు. భారత్‌లోనూ మన దేవుళ్ల ఫొటోలతో నోట్లు ఉండాలని, ఇది 100 కోట్ల మంది హిందువుల డిమాండ్ అని చెప్పారు. (చదవండి: అయోధ్య రామ మందిరానికి సెలబ్రిటీలు ఎంతెంత ఇచ్చారో తెలుసా? )

అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తవుతుందని, 22న రాముని ప్రతిష్ఠాపన కూడా జరుగుతుందని గుర్తు చేశారు. అయోధ్యలో రాముడి గుడి కట్టలేరని, తేదీ కూడా చెప్పలేరని కొంతమంది అన్నారని చెప్పారు. భారత్‌లో వక్ఫ్ బోర్డు పేరుతో ఉన్న భూములు రిలీజ్ చేయాలన్నారు.

ఒక్క మహారాష్ట్రలోనే పది లక్షల ఎకరాల భూమి వక్ఫ్ బోర్డు పేరుతో ఉందని చెప్పారు. కాగా, సరయూ నదీ తీరంలో నిర్మించిన రామమందిరం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద హిందూ దేవాలయం. ఇది మన దేశ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలుస్తోంది. (చదవండి: ‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ అంటూ అమ్మకాలు.. అమెజాన్‌కు కేంద్రం నోటీసులు జారీ )